![]() |
| ASP కార్యాలయం భద్రాచలం |
భద్రాచలం ASP ఆధ్వర్యంలో వారి ఆఫీసు నందు అయ్యప్ప కాలనీ మరియు రెవెన్యూ కాలనీ పెద్దలను పిలిచి మరియు అక్కడ నివసించు మిగతా ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో భద్రాచలం ASP శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాలంటే మీరు కాలనీలలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా సిసి కెమెరాలు ప్రతి వీధి కార్నర్లల వద్ద ఏర్పాటు చేసుకొవాలి, అపరిచిత వ్యక్తులు కల్పించినట్లయితే పోలీసు వారికి సమాచారం అందించాలి. దొంగతనాల నియంత్రణలో మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అలాగే సైబర్ నేరములకు గురించి మరియు గంజాయి ఇతరత్రా మారక ద్రవ్యాల గురించి ఇట్టి సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ASP శ్రీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, భద్రాచలం ఇన్స్పెక్టర్ , బి రమేష్ మరియు సిబ్బంది అయ్యప్ప కాలనీ వాసులు మరియు రెవెన్యూ కాలనీవాసులు పాల్గొన్నారు.

0 Comments