ఖమ్మం, జనవరి 05, బిసిఎం10 న్యూస్
.
ఖమ్మం వైరారోడ్ లోని ఆర్సిఎం చర్చ్ లో ఆదివారం 'డా కేర్ హోమియోపతి' ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వై గణేష్ మాట్లాడుతూ డా కేర్ హోమియోపతి సిఎండి డా ఏఎం రెడ్డి సహకారంతో ఉచితంగా క్యాంప్ నిర్వహించి వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హోమియో వైద్యం ద్వారా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి పరిస్కారం లభిస్తుందన్నారు. ఈ క్యాంప్ ఏర్పాటు లో సహకరించిన ఫాస్టర్ సురేష్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారితో పాటు ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ ఆశ కుమారి, సుష్మిత, చర్చ్ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments