Breaking News

Loading..

కమనీయం శ్రీ సీతారాముల తప్పోత్సవం..

 హంస వాహనం పై రాముల వారి  జలవిహారం ఆద్యంతం అపురూపం అద్వితీయo వీక్షించుటకు రెండు కళ్లు చాలనంత చారిత్రక ఘట్టం.

ఒక వైపు బాజా భజంత్రీల సందడి మరో వైపు వేద పండితుల మంత్రోచ్ఛరణలు.మిరిమిట్లు గొలిపే వెలుగు జిలుగుల కాంతులు భక్తజన సంసందోహం నడుమ హంస వాహనం పై సీతా రాముల ను చూసి పరవశ ముగ్ధలైన భక్తులు జగదభి రామ జానకి రామా అంటూ భక్తుల జయ జయ ద్వానాలు తో గోదావరి నది తీరం మారుమోగింది.!భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం. పుణ్య తీర్థం కూడా. ముక్కోటి వేడుక తరతరాలుగా సాంప్రదాయ బద్ధంగా ఇక్కడ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా ఈరోజు గోదావరి నది తీరంలో  శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జలవిహారం వేడుక కనుల పండువుగా, కమనీయంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల రామాలయంలో తొలుత వేద పండితులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజభజంత్రీల సందడి నడుమ, పల్లకిపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేంచేయింపచేసి, భక్తుల జయ జయ ద్వానాలతో ఊరేగింపుగా పవిత్ర గోదావరి నది తీరానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని కూర్చుండబెట్టి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి హారతులు ఇచ్చారు. వేద మంత్రాలను పఠించారు. విద్యుత్ కాంతులు మిరుముట్లు గొలుపుతుండగా, గోదారమ్మ పులకిస్తుండగా, శ్రీరామ జయరామ అంటూ భక్తులు జై జై లు నడుమ వేదమంత్రలు లతో  చూడాముచ్చటైన  శ్రీ సీతారామచంద్ర స్వామి వారు జలవిహారం చేసిన తీరు భక్తులను తన్మయానికి గురిచేసింది. బాణాసంచా సందడి భక్తులను అలరించింది.పవిత్ర పావన గౌతమీ నదీ తీరంలో ఐదు సార్లు హంస వాహనంపై తిరుగుతూ వైకుంఠ రాముడు భక్తులకు సాక్షాత్కరించారు. మరోవైపు రకరకాల విద్యుత్ కాంతులతో బాణాసంచా కాల్చిన తీరు భక్తులను తన్మయానికి గురిచేసింది. గోదావరి ఇసుక తిన్నలపై కూర్చొని కనులారా ఈ వేడుక తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి. శ్రీరామ..జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ద్వానాలు మిన్నంటాయి. గోదావరి తీరం అంతా జనసంద్రమైంది. గోదావరి తీరం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అధికారులు తీసుకున్న చర్యలు భక్తులను ఆకర్షించాయి.భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ స్వామివారి తెప్పోత్సవ వేడుకలో... తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,  భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Report by :

అనిల్ కుమార్ గూడూరు

చీఫ్ ఎడిటర్ బిసిఎం10 న్యూస్

 భద్రాచలం.

Post a Comment

0 Comments