Breaking News

Loading..

సెమీ ఫైనల్స్ కి చేరిన కే ఎన్ ఆర్ లెవెన్, వైఎంసిసి ..

భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో తాళ్లూరి భారతి దేవి జ్ఞాపకార్థం, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో  నడుస్తున్న  నెహ్రు కప్ ప్రైజ్ మనీ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన పోటీలలో  ఇల్లందు వైఎంసీసీ జట్టు, కే ఎన్ ఆర్, భద్రాచలం జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. శుక్రవారం నాడు  ఉదయం జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కుంట లెవెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్లకు 108 పరుగులు సాధించారు. ఈ జట్టులోని చైతన్య 34 పరుగులు,వెంకట్ 23 పరుగులు చేశారు. 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన  కే ఎన్ ఆర్ భద్రాచలం జట్టు. 11 ఓవర్లలో 109 పరుగులు సాధించి విజయం సాధించి సెమీఫైనల్ లో అడుగు పెట్టారు. ఈ జట్టులోని భరత్ 42 పరుగులు, ఆర్యన్ 36 పరుగులు, రాజు 16 పరుగులు సాధించారు. పండు మేన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును  ఆర్ కే షాపింగ్ మాల్ అధినేత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అందించారు. మధ్యాహ్నం జరిగిన రెండవ మ్యాచ్లో వైఎంసిసి ఇల్లందు జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో  164 పరుగుల భారీ స్కోర్ సాధించారు. 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూ స్టార్ కొత్తగూడెం జట్టు 156 పరుగులు సాధించి ఓటమి పాలయ్యారు. వైఎంసిసి జట్టులోని సాయి కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇరవెండి మాజీ  ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీ అందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ ఫౌండర్ తోటమల్ల వెంకట బాలయోగి, అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్.కె సలీం, కోశాధికారి కుంచాల సదానందం, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున, ఉదయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments