కామ్రేడ్ బండారు శ్రీదేవి గారి ఆశయసాధనకు కృషి చేయడమే ఆమెకు ఇచ్చే ఘన నివాళి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జె రమేష్.
![]() |
| కామ్రేడ్ బండారు శ్రీదేవి 6వ వర్ధంతి. |
సిపిఎం పార్టీని బలోపేతం చేయడం ద్వారా అమరజీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి ఆశయ సాధనకు కృషి చేయాలని అదే ఆమెకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నాయకులు, పార్టీ సభ్యులు అమరజీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి 6వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు, ఐద్వా పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏ జే రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ శ్రీదేవి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేవారిని, ప్రజా ఉద్యమంలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్న తన భర్త బి బి జి తిలక్ కు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రజా ఉద్యమ అభివృద్ధికి పోడ్పాటును అందించే వారిని అన్నారు. పార్టీలోనూ, మహిళా సంఘంలోనూ ఆమె క్రియాశీలకంగా పని చేశారని అన్నారు. ప్రజా సంఘం సభ్యత్వం చేర్పింపు తో పాటు పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనేవారిని గుర్తు చేశారు. ఆమె మరణం కుటుంబానికి,ఉద్యమానికి లోటని అన్నారు. ఇంకా ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు సీనియర్ నాయకులు బి బి జి తిలక్ లు మాట్లాడారు. ముందుగా కామ్రేడ్ శ్రీదేవి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జే.రమేష్ పూలమాల వేయగా నాయకులు చిత్రపటం ముందు పూలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, కోరాడ శ్రీనివాస్,భూపేంద్ర, కుంజ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఏం వి ఎస్ నారాయణ, బి జె ఎల్ పి దాసు, డి రామకృష్ణ, ఐద్వా నాయకులు ఎర్రం శెట్టి పూర్ణ ,సక్కుబాయి, రాధా, కుటుంబ సభ్యులు అరుణ్ చంద్, చిన్న ,బండారు సత్యనారాయణ ,బండారు ప్రతాప్, సుందరయ్య, మావో కుమార్ తదితరులు పాల్గొన్నారు..

0 Comments