● ఒకప్పుడు దేశ రాజకీయాల్లోకి విద్యార్థి నాయకులు వచ్చి పెను మార్పుకు కారకులయ్యారు.
● మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.
● గత కొంతకాలంగా రాజకీయాలు రియల్టర్లు, బడా కార్పొరేట్ సంస్థల నాయకులు, రౌడీ షీటర్లతో నిండిపోతున్నయి.
● దేశ పౌరులు ఆనాటి సమాజంలో చదువు లేక అవివేకంతో ఓట్లు వేసేవారు.
● నేటి సమాజంలో దేశ పౌరులు విజ్ఞానంతో ఉన్న అజ్ఞానులుగా మారి డబ్బులకు ఓటు అమ్ముకుంటూ అసమర్థులను పాలకులుగా చేస్తున్నారు.
● దేశ పౌరుల్లో మార్పు రాకపోతే దేశ ప్రగతి, సంస్కరణలకు అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది.
● దీనికి కారణం విద్యార్థి ఎన్నికలు జరగకపోవడమే.
ఖమ్మం, జనవరి 25, బిసిఎం10 న్యూస్.
భారతదేశ రాజకీయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకు తెలిసే విషయాలు కొన్ని బాధాకరంగా ఉన్నాయి. ఒకప్పుడు దేశ స్వాతంత్రం కోసం వివిధ పోరాటాల్లో నాయకత్వం వహించి ఉద్యమాలు చేసిన నాయకులు, చదువుకున్న మేధావులు, విద్యార్థి లోకం నుండి ఎదిగి వచ్చిన నాయకులు అందరు రాజకీయాల్లో తమదైనశైలిలో ఎన్నుకోబడి, పాలన చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆనాడు రాజకీయాల్లో రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ సిద్ధాంతాలను గౌరవిస్తూ పార్టీ విధేయులుగా పనిచేస్తూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ సిద్ధాంతాలతో సమాజంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా కృషి చేసేవారు. దానికి కారణం ఆనాటి విలువలు, ఆనాటి సాంప్రదాయాలు అన్ని కలిసి వచ్చాయి. ఆనాటి వ్యవస్థలో డబ్బు ప్రథమ భూమిక పోషించక పోయిన, వ్యక్తుల ప్రభావం ఓటర్లైన దేశ పౌరులం మీద ప్రభావం చూపించేవి. కొన్ని ప్రాంతాల్లో అజ్ఞానంతో ఓటు వేసిన మరికొన్ని ప్రాంతాల్లో చైతన్యవంతమైన ఓట్లు వేసి తమ నాయకుడిని ఎన్నుకునేవారు. కానీ రోజు రోజుకు మారుతున్న పరిణామాలు ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణ పేరు వల్ల భారత దేశంలో ప్రపంచ బ్యాంకు నుండి డబ్బులు సంచులు వేల కోట్లుగా వచ్చి ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను తీసుకొచ్చి విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇతర అవసరాలు ప్రజలకు అందించకుండా, ఉచితాలకు అలవాటు చేసి ఇవ్వాల్సిన ఉచితాలు ఇవ్వకుండా, పనికిరానివి ప్రజలకు ఇస్తూ వారిని సోమరిపోతుల్ని చేయడం వల్ల నేటి సమాజం అంగవైకల్యంలో ఉందని అర్థమవుతుంది. ప్రపంచీకరణ మొదలైన తర్వాత భారతదేశంలో ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పులు తీసుకొచ్చి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, రాజకీయ నాయకులు తమ అనుచరులకు చేతిలోకి లక్షల కోట్ల రూపాయలు చేరివేయడం, అవినీతి సొమ్మంతా వారి చేతుల్లో ఉండడం వల్ల నేటి రాజకీయాల్లోకి బడా కార్పొరేట్ బాబులు, రియల్టర్లు, మాఫియాలు, రౌడీలు, సంఘవిద్రోహశక్తులందరు డబ్బులతో రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చాయి. వీరంతా ఈ చదువుకున్న సమాజాన్ని ఏలుతున్నారు.
ఒకప్పుడు 'చదువు లేని సమాజంలో చదువుకున్న వారు పరిపాలన చేస్తే' ఇప్పుడు 'చదువుకున్న వారిని చదువు లేని సంఘవిద్రోహ శక్తులు పరిపాలన చేస్తున్నాయి' కేవలం ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. ఒక ఆశయాలు, ఒక ఆలోచన విధానాలు లేకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తూ, ప్రజల్ని ఉచితాల పేరుతో సోమరిపోతుతనంలోకి నెట్టు వేయబడుతున్నాయి. నేటి సమాజం కోరుకోవాల్సింది విద్యా, ఉచిత వైద్యం, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం యువతకు అవకాశం ఇవ్వాలని పోరాటాలు చేయాలి. డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెట్టాలి. కానీ ఉచితంగా మాకు ఇవి ఇవ్వండి, ఉచితంగా మాకు నిత్యవసర సరుకులు ఇయ్యండి, మేము ఇంట్లో కూర్చొని హాయిగా సోమరిపోతుల్లా ఉండిపోతాం. పరిపాలన మీరు చేసుకోండి, ఈ దేశాన్ని మీరు విచ్ఛిన్నం చేసిన, తాకట్టు పెట్టిన, మేం పట్టించుకోము అనే స్థాయిలో మన దేశ ప్రజలు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం ఒకప్పుడు యూనివర్సిటీల్లో, విద్యాసంస్థల్లో, విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొనేవాళ్లు. తద్వారా విద్యార్థి ఎన్నికల్లో, నాయకత్వం వహించిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏ విద్యాభ్యాసం ద్వారా, విద్యార్థి రాజకీయాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని, ఆలోచనలను, సిద్ధాంతాలని, సమాజం భావ కోసం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి గెలిచిన తర్వాత, ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా పోరాటాలు చేస్తూ ప్రభుత్వ సంస్కరణలు తీసుకొచ్చేవారు. కానీ నేడు రాజకీయ నాయకులు, కులాల వారిగా పరిపాలన చేస్తూ కులాలకు మెజార్టీ ఓటు బ్యాంకు వచ్చే వర్గాలకు మాత్రమే న్యాయం చేసే విధంగా పరిపాలన చేయడం దుర్మార్గం. ఇక మనం ప్రభుత్వాల ముందు పెట్టాల్సిన డిమాండ్ ఏంటంటే సంఘవిద్రోహ శక్తులైన వ్యక్తులను రాజకీయాల్లోకి రానీయకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలలో, వివిధ విద్యా సంస్థలలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని, విద్యా పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన సబ్జెక్టు పాఠ్యపుస్తకాల్లోకి సైన్స్ ఆర్ట్స్ విభాగాలు అని తేడా లేకుండా ఈ దేశ చరిత్ర పైన అవగాహన పెంచే విధంగా, రాజ్యాంగం మీద అవగాహన పెంచే విధంగా ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుని వారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, ఇలా చేయడం వల్ల రేపటి సమాజంలో మార్పు జరిగి ఒక నిస్వార్ధమైన రాజకీయ నాయకులు పుట్టి దేశ ప్రగతిలో వారు అగ్రభాగాన నిలిచి దేశాన్ని ప్రగతి భాగంలోకి తీసుకుపోయే ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ.. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

0 Comments