Breaking News

Loading..

'శ్రీవిద్యానికేతన్' లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు.

ఖమ్మం, జనవరి 11, బిసిఎం10 న్యూస్.

ఖమ్మం కరుణగిరి టిఎన్జీవోస్ కాలని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థ ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సంక్రాంతి ప్రాముఖ్యత, ప్రాధాన్యతను విద్యార్థిని విద్యార్థులకు తెలిసే విధంగా భోగిమంటలు, రంగవల్లి పోటీలు నిర్వహించి చిన్నారులకు భోగి పండ్లు పోసి, గాలి పతంగులు ఎగిరేసి ఉత్సాహ వాతావరణంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ డైరెక్టర్ వెంకట సత్యనారాయణ యాదవ్, ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ షెహన మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఘడియలను మకర సంక్రాంతిగా పిలుస్తారని ఇటువంటి మకర సంక్రాంతి దేశానికి వెన్నుముక్కుగా నిలిచే రైతుల పండగగా గౌరవించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ సంక్రాంతి సందర్భంగా అనేక రకాల క్రీడలు నిర్వహించి మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం యువతకు తెలిసే విధంగా కృషి చేయాలని గుర్తు చేశారు. శ్రీవిద్యానికేతన్ లో మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రతి వేడుక విద్యార్థులకు తెలిసే విధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వారన్నారు. అనంతరం నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో విద్యార్థిని విద్యార్థులు ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Post a Comment

0 Comments