Breaking News

Loading..

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి..జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్..


ఈరోజు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ధర్నా అనంతరం ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రజబల్లి కాలనీ చెందిన ఆదివాసిలు గత 40 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఆటవి హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు 58 కుటుంబాలకు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఏపీవో తో మాట్లాడడం జరిగింది అనంతరం ఏపీవో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని వారందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ రజబల్లి కాలనీ ఆదివాసీలు గత సోమవారం ప్రజాదర్బార్లో గ్రామానికి మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మంచినీళ్లు అందించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదు వెంటనే పరిష్కరించాలని కోరగా సంబంధిత అధికారులను పిలిచి వారితో మాట్లాడడం జరిగింది ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఏపీవో హామీ ఇచ్చారు, అదేవిధంగా ఆళ్ళపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన వలస ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని,48 కుటుంబాలు గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు రాలేదని అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కుంజా శ్రీను, పోడు సాగుదారులు, మడకం సీతయ్య, మడకం నాగేష్, యసం చిన్నబి, నూప మల్లయ్య , ఇరప ముత్తయ్య, కారం సింగమ్మ ,మడకం ఉంగమ్మ ,సున్నం సమ్మక్క, కనితి జోగయ్య ,మడకం వీరయ్య ,బీరప్పగుట్టయ్య , ఉయక గీత, ముక్కోటి సురేష్ ,మడి అనిల్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments