Breaking News

Loading..

INTUC లో భారీ చేరికలు. TNTUC కి ఎదురుదెబ్బ..

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ఐటీసీ – పి.ఎస్.పి.డి’లో తాజాగా గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ, షెడ్యూల్ లో భాగంగా ఈనెల 21న DCL గారితో అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సమావేశం కావాల్సి ఉంది ఆరోజు ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఇది ఇలా ఉండగా 13వ వేతనం ఒప్పందంలో భాగస్వాములైనటువంటి ముగ్గురు TNTUC (ఆఫీస్ బేరర్స్) విజయ భాస్కర్ రెడ్డి. రెడ్డం రామకృష్ణారెడ్డి. సుతార్ నరేష్ కుమార్ అనే కార్మిక సోదరులు TNTUC కార్యవర్గానికి రాజీనామా చేసి ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర రెడ్డి. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గోనె దారుగా గారి సమక్షంలో ఐ ఎన్ టి యు సి యూనియన్ లో చేరారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మంచి వేతనం ఒప్పందం జరగాలంటే ఐ ఎన్ టి యు సి పక్షాలను అత్యధిక మెజార్టీతో గెలవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పార్టీ పరంగా మేము ఎప్పుడూ అండగా ఉంటామని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యులు యారం పిచ్చిరెడ్డి. ఐఎన్టియుసి ఐటిసి సారపాక అధ్యక్షులు గొనె రామారావు ఐ ఎన్ టి యు సి నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments