Breaking News

Loading..

వృథాగా ఉద్దీపకం వర్క్ బుక్స్ ..ఆచరణ కరువు. పిఓ రాహుల్.

 

జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు ఇంగ్లీష్ మరియు గణితంలో కనీస సామర్ధ్యాలు లేకపోవడం వలన చదువులో వెనుకబడిపోవడం గమనించి వారి విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్స్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, దానిని ఉపాధ్యాయులు విద్యార్థులపై సరిగా ఆచరణలో పెట్టడం లేదని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 

మంగళవారం నాడు దుమ్మగూడెం మండలం లోని బండారు గూడెం, రేగుంట జిపిఎస్ పాఠశాలలను మరియు ఆర్లగూడెం ఏ హెచ్ ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి, ఎస్సీ ఆర్పి పనితీరును మరియు ఉద్దీపకం వరకు బుక్స్ కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నది, పిల్లలను అడిగి వారి చేత బోర్డుపై రాయించి ఒక్కొక్క విద్యార్థిని లేపి వర్క్ బుక్ లోని సారాంశాలను అడిగి తెలుసుకున్నారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పిల్లలు ఇంగ్లీష్ గణితం చదవడం రాయడంలో వెనుకబడి పోతున్నందున గణితంలో గణిత ప్రాథమిక స్థాయి సంఖ్యల నుండి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగా హారాలు వాటికి సంబంధించిన కృత్యాలు మరియు చిత్రాలతో విద్యార్థి పాఠశాలల్లో ఆనందంగా ఆహ్లాదంగా నేర్చుకొనుటకు అనుకూలంగా రూపొందించామని అన్నారు.

ఇంగ్లీష్ మీడియంలో రూపొందించిన ఉద్దీపకములు విద్యార్థులు సొంతంగా తామంతట తామే వీటిలోని కృత్యాలు బొమ్మల ఆధారంగా చదువుకొని దానిలోని కృత్యాలను చేసే విధంగా రూపొందించడం జరిగిందని, విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్నదే గాక తదుపరి ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ వర్క్ బుక్ ను తయారు చేయడం జరిగిందని అన్న పి ఓ రాహుల్ 

ప్రస్తుతం ఈ పాఠశాలల్లో ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించడం లేదని, సంబంధిత ఉపాధ్యాయులు పిల్లల చేత పుస్తకములోని కృత్యాలను తెలియజేసి బోర్డుపై రాయించి పిల్లల చేత చెప్పించాలని అన్నారు. ఎస్ సి ఆర్ పి పనితీరు మెరుగుపరచుకోనీ ప్రతిరోజు తన పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించి ఉపాధ్యాయులకు ఉద్దీపకము వర్క్ బుక్ సంబంధించిన కృత్యాలు పిల్లల చేత చేయిస్తున్నది లేనిది చూడాలని అన్నారు. రేగుంట పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత అనాధికారిక సెలవు పై వెళ్ళినందున మరియు వెంకన్న, సత్తెమ్మ టీచింగ్ డైరీ నిర్వహణ సరిగా లేనందున శోకజ్ నోటీసులు జారీ చేయాలని ఏసీఎమ్ఓ రమణయ్యకు ఆదేశించారు. అనంతరం ఆర్లగూడెం ఏ హెచ్ ఎస్ పాఠశాలలు సందర్శించి వేదిక్ మెస్ తరగతిని పరిశీలించారు

గణితం సబ్జెక్టు పై భయాన్ని పోగొట్టడానికి వేదిక్ మాథ్స్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగిందని, పిల్లలు తప్పనిసరిగా లెక్కలు ఎలా చేస్తున్నది సంబంధిత టీచర్ గమనిస్తూ ఉండాలని పిల్లలు క్లాసులో నేర్చుకున్నదే గాక ఇంటికిపోయి ప్రాక్టికల్ గా చేయాలని అన్నారు.

నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం తప్పనిసరిగా పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు వేడిగా ఉన్నప్పుడే పిల్లలకు పెట్టాలని, హెచ్ఎం వార్డెన్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, మెనూ సరిగా అమలు చేయకపోతే సంబంధిత హెచ్ఎం, వార్డెన్లకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సోమశేఖర్, ఎస్ సి ఆర్ పి రామారావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

-

Post a Comment

0 Comments