ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే కేటాయించాలని తెలంగాణ జన సమితి పార్టీ భద్రాచలం నియోజకవర్గ కోఆర్డినేటర్ పూనెం ప్రదీప్ కుమార్ కోరారు. భద్రాచలం పట్టణంలో రెండవ విడత నిర్మించిన సుమారు 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇల్లు లేని అర్హులైన నిరు పేదలను గుర్తించి గతంలోనే ఇండ్లు కేటాయించారని, కొన్ని అనివార్య కారణాలవల్ల కేటాయించిన వారికి ఇండ్లు పంపిణీ చేయలేకపోయారని, గత సంవత్సరం ఇండ్లు వచ్చిన పేదలకే ఆ ఇండ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా అప్పటి ఇండ్ల జాబితా మారుస్తున్నారనే ప్రచారం జరుగుతుందని, ఏ ఒక్క పేరు మారిన సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సభకు పిలిచిన 117 మంది లబ్ధిదారులకు డిసెంబర్ 9 లోపు ఇండ్ల పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని, ఏ విధమైన అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేకుండా గుర్తించిన పేదలకే ఇండ్లు కేటాయించే విధంగా ఆదేశించాలని ఆయన కోరారు. రాజకీయ కారణాలు పక్కనపెట్టి అర్హులైన పేదలకే ఇండ్లు దక్కాలని ఆయన అన్నారు. ఏ ఒక్క పేరు మారిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని ఆయన తెలిపారు.
0 Comments