Breaking News

Loading..

భద్రాచలం మండలంగా జీవో విడుదల..

భద్రాచల పట్టణాన్ని  మండలం గా ఏర్పాటు చేస్తూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్  హర్షం వ్యక్తం చేశారు.


 రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం నియోజకవర్గం  ఎంతో నష్టపోయిందని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు భద్రాచలాన్ని  అభివృద్ధి ఆమడ దూరంలో ఉంచిందని.అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే ఒక గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ జీవో విడుదల చేసి భద్రాచల  పట్టణాన్ని ముక్కలుగా విభజించే ప్రయత్నం చేశారని.ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మూడు పంచాయతీల జీవో కు వ్యతిరేకంగా ఆ జీవో రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా  నేను కోర్టును సైతం ఆశ్రయించడం జరిగిందని.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గంనీ అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది అని ఈ జీవో ఒక ఉదాహరణ అని, ఈరోజు విడుదలైనటువంటి జీవోలో భద్రాచలాన్ని ఒకే మండలం గా,  ఆ మండలంలో భద్రాచలం ఒకే గ్రామపంచాయతీగా ఉంచటం భద్రాచల ప్రజలందరూ ఎంతో ఆనందించదగ్గ విషయమని.భద్రాచల గ్రామానికి గ్రామపంచాయతీ ఎన్నికలు,  మండల పరిషత్ ఎన్నికలు జరిపేందుకు ఈ జీవో ద్వారా పరిష్కారం చూసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రివర్యులు  భట్టి విక్రమార్కకి,మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, భద్రాచలం ప్రాంత సమస్యను సీఎం గ దృష్టికి,మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యను పరిష్కారం చూపే దిశగా నడిపించిన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు  గారికి, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్,బ్లక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుబలుసు నాగ సతీష్, మాజీ గ్రంధాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్,ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బీసీ సెల్ నాయకులు రాగం సుధాకర్,RG సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మగపు రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments