Breaking News

Loading..

భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు.

ఖమ్మం, నవంబర్ 26, బిసిఎం10 న్యూస్.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసింది కేంద్రం. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ఏడాది పొడవునా వేడకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే మంగళవారం పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షత వహించనున్నట్లు తెలిపింది. మంగళవారం నుంచి ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖ పేర్కొంది. ఈ మేరకు నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ రోజు జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో జరుపుకునే వేడుక మాత్రమే కాదని, ఇది దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.

● రాజ్యాంగం పై వెబ్‌సైట్‌, ఏడాది పొడవునా సంబరాలు.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం https: //constitution75.com


పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో రాజ్యాంగ పరిషత్‌ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నేటి నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దానికి సంబంధించిన వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ధ్రువపత్రాలు పొందొచ్చని వివరించింది.

Post a Comment

0 Comments