Breaking News

Loading..

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్టు...

 


 దుమ్ముగూడెం మండలం సీతానగరం లో దుమ్ముగూడెం పోలీసులు,141Bn CRPF సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చత్తీస్గడ్ రాష్ట్రం పామేడ్ ఏరియా కమిటీకి అనుబంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘానికి చెందిన అజ్ఞాతదళ సభ్యురాలిని అరెస్టు చేయడం జరిగింది. 

అరెస్ట్ కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వివరాలు.

ఓయెమ్ నందే @సమ్మక్క,D/o.మాసయ్య,40 సం, R/o కొత్తగూఢ గ్రా., బాసగూడ PS, బీజాపూర్ జిల్లా., చత్తీస్గడ్ రాష్ట్రం.అరెస్టు కాబడిన పై వ్యక్తి 1999 సంవత్సరంలో తన 16 వ యేట నుండి 2002 వరకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన బాసగూడ ఏరియా బాలల సంఘంలో సభ్యురాలిగా పనిచేసింది.అనంతరం 2002వ సంవత్సరం నుండి 2018 వరకు చత్తీస్గడ్ రాష్ట్రం పామేడ్ ఏరియాలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘం(KAMS) లో దళ సభ్యురాలుగా,2018 నుండి నేటి వరకు ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేసింది.KAMS లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశాల ప్రకారం తన తోటి దళ సభ్యులతో పామేడ్ ఏరియాలోని ఆదివాసి గ్రామాల్లో సంచరిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ,నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీతో కలిసి తిరుగుబాటు చేసే విధంగా అమాయక ఆదివాసి ప్రజలను ప్రేరేపించడం వంటి కార్యక్రమాలను చేపట్టినది.అరెస్ట్ కాబడిన నిందితురాలి వద్దనుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలు,సాహిత్యం స్వాధీనం చేసుకొని,భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ సెక్యూరిటీ యాక్ట్ మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి,జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించడమైనది.నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో మరియు దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తూ అమాయక ఆదివాసి ప్రజలను రెచ్చగొడుతూ వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించినా,ఆదివాసి ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నా,వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అటువంటి వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Post a Comment

0 Comments