Breaking News

Loading..

టిఎన్జీవోస్ కాలని 'శ్రీ విద్యానికేతన్' లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు.

టిఎన్జీవోస్ కాలని 'శ్రీ విద్యానికేతన్' లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు.

ఖమ్మం, నవంబర్ 14, బిసిఎం10 న్యూస్.

ఖమ్మం కరుణగిరి టిఎన్జీవోస్ కాలనీ 'శ్రీ విద్యానికేతన్' లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ చైర్మన్ రేఖ రాధ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని, అలా ఇష్టపడి చదివే విద్యార్థులు తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ రేఖ శ్రీలక్మి మాట్లాడుతూ విద్యార్థులందరు లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో దానికి అనుగుణంగా చదువుతూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావలని ఆకాంక్షించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ మా పాఠశాలలో ఖమ్మం రురల్, అర్బన్ మండలాల్లోని పేద మధ్య తరగతి కి చెందిన విద్యార్థులకు ప్రొపెల్ సంస్థ కొలాబరేషన్ తో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. ఈ విధానమైన భోదనతో సాధారణమైన విద్యార్థులతో అసాధారమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. వేడుకల్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం బాలల దినోత్సవంలో భాగంగా వైస్ ప్రిన్సిపాల్ షెహనా ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫ్ టీచింగ్, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిధుల ద్వారా బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments