భద్రాచలం కొత్త మార్కెట్ లో నిర్వహిస్తున్న ఒక రేషన్ దుకాణం నుండి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రెండు క్వింటాల భియ్యం పట్టివేత.అక్రమ రేషన్ తరలింపు పై ప్రత్యేక దృష్టి పెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు. భద్రాచలం కేంద్రంగా సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం పై జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్ ఉక్కు పాధం.
కొత్త మార్కెట్ కేంద్రంగా పలువురు ఆటోవాలాలు రేషన్ దుకాణదారులతో ఒప్పందం మేరకు పేద బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన రేషన్ సరుకులను ఎదేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ లక్షలు ఘటిస్తున్నారని ఇటీవల వస్తున్న నేపథ్యంలో అక్రమ దారులపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం.రేషన్ బియ్యం కొత్త మార్కెట్ నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపట్నం కి అక్రమంగా తరలించబోతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కాపుగాచి వలపన్ని పట్టుకున్న భద్రాచలం స్పెషల్ బ్రాంచ్ పోలీస్.అక్రమ రేషన్ తరలిస్తున్న ఆటోని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి, రవాణా చేస్తున్న వ్యక్తిని అధుపులోకి తీ సుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


0 Comments