ఖమ్మం మున్నేరు వరద బాధితులకు 'స్లీపింగ్ కిట్స్' పంపిణీ.
ఖమ్మం, 03 నవంబర్, బిసిఎం10 న్యూస్.
స్థానిక రామకృష్ణా విద్యాలయంలో మున్నేరు వరద బాధితులకు అభయ ఫౌండేషన్, విహే & దేవకి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో విహే వ్యవస్థాపకులు బిజెపి 2019 ఎంపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు చేతుల మీదుగా స్లీపింగ్ కిట్లను (6×6 ఫ్లోర్ మ్యాట్, రెండు దిండ్లు, కవర్లు, రెండు దుప్పట్లు) పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మందికి ఒక్కోదానికి వెయ్యి రూపాయలు విలువచేసే స్లీపింగ్ కిట్లను పంపిణీ చేశారు. గతంలోనూ మున్నేరు వరద బాధితులకు బియ్యం, నిత్యవసర, స్టీల్ సామాగ్రిని దేవకీ వాసుదేవరావు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మున్నేరు వరద బాధితులకు సుమారు 70 లక్షలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు. గతమెన్నడు లేని విధంగా ఖమ్మం నగరానికి వరదలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఎంతైనా ఉందని, ప్రకాష్ నగర్ వద్ద బ్రిడ్జి ముందు చెక్ డ్యాం ఏర్పాటు కారణంగానే వరదలు సంభవించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు 16,000 ఇచ్చి పులిహోర ప్యాకెట్లు పంచి చేతులు దులుపుకోవడం కాదు రాజకీయాలకు అతీతంగా ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ లోకి నీరు వచ్చి తూము ద్వారా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే వర్షాకాలంలోగా ఖమ్మం నగర ప్రజలకు వరద ప్రభావం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దాతల సహకారంతో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో మావంతుగా వరద బాధితులకు సహాయం అందించడం జరిగిందన్నారు. పెద్దలు సాటివారు ఆపదలో ఉంటే ఆదుకోవాలని ఆలోచనతో సంస్థ ద్వారా దాతల సహాయంతో వరద బాధితులకు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. కష్టకాలంలో ఉన్న వారందరికీ మా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉండి తోచిన సహాయం అందిస్తుందన్నారు. గ్రామీణ నిరుపేద యువతకు తోడుగా వారి బతుకులు వెలుగులు నింపడం కోసం మా సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది గ్రామీణ నిరుపేద యువత తమకు తాను సొంతంగా ఉపాధి కల్పించుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారుబిచేసి మానవతా విలువలను పెంపొందించి సాటి మనిషికి సహాయపడే గుణాన్ని అందించి మంచి సమాజాన్ని నిర్మించడం అనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, విహే సెక్రటరీ చంద్రశేఖర్, జయంత్ పటేల్, కేశవ్లాల్ పటేల్, బిజెపి నాయకులు భద్రం, కొణతం లక్ష్మీనారాయణ, సత్యనారాయణ యాదవ్, విఐహెచ్ఈ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




0 Comments