![]() |
| ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు |
బూర్గంపహాడ్ మండలంలో బుదవారం పర్యటించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు టేకులచెరువు, నకిరిపేట, లక్ష్మీపురం గ్రామంలోని పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. లక్ష్మీపురం గ్రామంలోని మహిళలు విద్యుత్ స్తంభాలు కొరకు ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు గారికి తెలుపగా స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వే చేసి వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, బిజ్జం వెంకటేశ్వరరెడ్డి , బాదం నాగిరెడ్డి, బాదం రమేష్ రెడ్డి, కైపు లక్ష్మీనారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మిత్రపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments