Breaking News

Loading..

విలీన గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాలి..గోపగాని శంకరరావు..



ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ జన సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గోపగాని శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం భద్రాచలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో టాయిలెట్లను, వాకింగ్ ట్రాక్ , ఫ్లడ్ లైటింగ్, వాల్ హైట్ పెంచే విధంగా ఏర్పాటు చేయాలని, ప్రతినిత్యం కొన్ని వందలమంది ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారని, వారికి కనీస ఏర్పాట్లు కూడా లేవన్నారు. ఈ క్రీడా మైదానంలో ఎన్నో గిరిజన క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారని, క్రీడల్లో పాల్గొనే విద్యార్థినీలు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

 దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రాముడు నడయాడిన ఈ ప్రాంతం టిఆర్ఎస్ హయాంలో వివక్షతకు గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించకుండా వెంటనే రూ. 150 కోట్లు కేటాయించి, పట్టణంలోని ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్  లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఏటా రెండు మూడు సార్లు వరద ముంపు కు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పట్టణంలో కరకట్ట నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు.

 ఎమ్మెల్సీ కోదండరాం పర్యటనను విజయవంతం చేయండి.

ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాచలం విచ్చేస్తున్నందున ఈ పర్యటన విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 24 సాయంత్రం భద్రాచలం విచ్చేస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలకాలని కోరారు. 25 ఉదయం భద్రాచలం రామయ్యను దర్శించుకున్న అనంతరం ఆయన పాల్వంచలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.

Post a Comment

0 Comments