Breaking News

Loading..

ఐటీసీ నిర్మించిన టాయిలెట్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. తెల్లం వెంకట్రావు ఐటిడిఏ పిఓ. రాహుల్ ..



  • ఐటీసీ  సేవలు బేష్ : భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం  వెంకట్రావు        
  •  గిరిజన పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి* : ఐటీడీఏ పీవో రాహుల్                     
  • గిరిజన గురుకులంలో రూ.26 లక్షలతో నిర్మించిన టాయిలెట్స్ ప్రారంభం.        

భద్రాచలం గిరిజన గురుకులంలో బాలికల సౌకర్యార్థం రూ.26 లక్షలతో ఐటీసీ భద్రాచలం నిర్మించిన టాయిలెట్స్ ను భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీ రాహుల్ ఐఏఎస్ తో కలిసి బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత గురుకులం ప్రాంగణముకు చేరుకున్న ఎమ్మెల్యే, పిఓ, ఐటీసీ అధికారులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలికలు ఘన స్వాగతం పలికారు.

 అనంతరం టాయిలెట్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన గురుకులాల ఆర్.సి కె నాగార్జున రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.భద్రాచలం గిరిజన గురుకుల విద్యా సంస్థ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గిరిజన పిల్లలు ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన విద్యపై తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఐఏఎస్  మాట్లాడుతూ...గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. త్వరలోనే ఇంకా వినూత్న మార్పులతో చక్కని విద్యను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పాఠశాల, కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గిరి బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కష్టపడి చదవాలని సూచించారు.భద్రాచలం ఐటిసి పి.ఎస్.పి.డి యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్, జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్ ) పి.శ్యామ్ కిరణ్  మాట్లాడుతూ...తమ సంస్థ తరఫున భద్రాచలం గిరిజన గురుకులంకు అనేక రకాల సహకారం అందజేశామని, భవిష్యత్తులో కూడా సేవలందిస్తామని తెలిపారు. పిల్లలు ఐటీసీ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా బంగారు భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. ఎంబిబిఎస్ సీట్లు సాధించిన బాలికలను ఈ సందర్భంగా శాసనసభ్యులు, ఐటీడీఏ పీవో తదితరులు అభినందించి సన్మానం చేశారు. చదరంగం క్రీడలో రాణిస్తున్న ధనుశ్రీకి ఐటీసీ రూ.25వేల స్కాలర్షిప్ ను అందజేసింది.  ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి కె నాగార్జున రావు , ఐటీసీ బీపీఎల్ మేనేజర్ చెంగల్ రావు, ఐటీసీ ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ ,భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఏ పద్మావతి , భద్రాచలం గురుకుల ఆర్ జె సి ప్రిన్సిపాల్  ఎం. దేవదాసు, కళాశాల, పాఠశాల స్టాప్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments