Breaking News

Loading..

స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి..


రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు.

ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ల సమస్య పై  కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని  పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫాహిం,పి డి యస్ యూ(చంద్రన్న వర్గం)జిల్లా కార్యదర్శి గణేష్ అన్నారు.పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం యూటియఫ్ కార్యాలయం లో పి డి యస్ యూ జిల్లా నాయకులు మునిగల శివప్రశాంత్ అద్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా విద్యారంగం విధ్వంసానికి గురైందని కెసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని అన్నారు. ఎందుకంటే విద్యారంగానికి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడమే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగి డిగ్రీ ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వద్దనే ఉండడం మూలంగా ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు. స్కాలర్షిప్ రాకపోవడంతో రాష్ట్ర లో కొన్ని ఇంటర్,డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల మూసివేసిన పరిస్థితి తో పాటు కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితికి పాలక ప్రభుత్వాలే కల్పించాయని అన్నారు.అంతేకాకుండా రియంబర్స్మెంట్ రాక కళాశాల లు నిర్వహించే  పరిస్థితి లేదని అధ్వానంగా మారి నిర్వహణ కష్టతరమైపోయి కళాశాలలు మూసివేసే పరిస్థితికి నెట్టవేయబడ్డారని ఈ క్రమంలోనే ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ కళాశాలలో నిర్వహణకు కష్టమయి పోయిందని, భవనాల అద్దె బిల్లులు చెల్లించలేక పోతున్నామని మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదనతో వారు బంద్ కు పిలుపునిచ్చిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వానికి ప్రైవేటు విద్యాసంస్థలకు మధ్య ఏర్పడిన రియంబర్స్మెంట్ సమస్య కారణంగా విద్యార్థులు నలిగిపోకుండా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో    విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదించుతామని రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న వక్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ జిల్లా నాయకులు పార్థ సారథి, సాయి కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రామ్ చరణ్, ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిదులు వరలక్ష్మి(వివేకవర్థని) ముకుందా రెడ్డి (అనుబోస్ కాలేజ్),నరసింహారావు(KLR) బిక్కులాల్ (సురక్ష కాలేజ్) వేణు(ప్రియదర్శిని), రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments