రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవ కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర ప్రజలందరికీ ఆపద్బాంధవుడు *పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి* జన్మదినం సందర్భంగా,భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానుల ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు గారి* చేతుల మీదుగా ప్రసూతి విభాగంలోని మహిళలకు ఫ్రూట్స్ పంచి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ గారి* నేతృత్వంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు *డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు* ముఖ్య అతిథిగా హాజరై ప్రసుతి విభాగంలోని మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి ఫ్రూట్స్ ను అందజేయడం జరిగింది. శాసనసభ్యులకు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ ప్రజల మనిషి,రాష్ట్ర ప్రజల ఆపద్బాంధవుడు మన ప్రియతమ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించటం ఆనందకరమైన విషయమని, మంత్రిగారు కూడా రాష్ట్రంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం ఉన్న గొప్ప మహోన్నత వ్యక్తి అని, ఈరోజు ఆయన అభిమానులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సేవా నిర్వహిస్తూ ప్రజా సేవలో ముందుండటం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, బ్లక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మజీ గ్రంథాలయం చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకట్ రెడ్డి,నర్ర రాము,NSUI నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బీసీ సెల్ నాయకులు రాగం సుధాకర్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు గాడి విజయ్,మాచినేని భాను, కొత్త జయంత్,మాల మహానాడు నాయకులు అల్లాడి పౌల్ రాజ్, డేగల శివ,భూక్యా నరసింహ,రవి,మల్లి, వంశీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
0 Comments