భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా కన్వీనర్ వనమా శ్రీనివాసరావు మరియు డివిజన్ అధ్యక్షులు రాఘవులు, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం నాడు భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఉన్న ఎం.వి.ఐ కార్యాలయంలో నూతనంగా ఎం వి ఐ గా బాధ్యతలు తీసుకున్న వెంకట పుల్లయ్యను డ్రైవర్ల సంఘం కన్వీనర్లు, కో కన్వీనర్లు మరియు సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంవిఐ వెంకట పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయుచున్న డ్రైవర్లు ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా అధికారులు చెప్పినట్లు నడుచుకొని విధులు నిర్వహించాలని అన్నారు. మనము అజాగ్రత్తగా డ్రైవర్ గా విధులు నిర్వహించి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే అధికారులతో పాటు మన కుటుంబాలు కూడా చాలా బాధలు పడవలసి ఉంటుందని అన్నారు. డ్రైవర్లకు ఏమైనా వ్యక్తిగత సమస్యలు, కార్యాలయం పరంగా సమస్యలు ఉంటే నేరుగా తనకు సంప్రదించ వచ్చని తప్పనిసరిగా సమస్యలు పరిష్కరించి, నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కో కన్వీనర్ మరియు డివిజన్ అధ్యక్షులు రాఘవులు, కోకాన్వీనర్ నాగరాజు, సభ్యులు బిక్షం, వెంకట్రామిరెడ్డి ,జూమ్ లాల్, మర్నాద్, జానీ తదితరులు పాల్గొన్నారు.
0 Comments