Breaking News

Loading..

ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడమే మేలు..!!

ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడమే మేలు..!!



హైదరాబాద్, ఆక్టోబర్ 25 బిసిఎం10 న్యూస్.

నేను రెండు నెలల గర్భవతి, నన్ను స్కానింగ్ కోసం తీసుకెళ్ళడానికి ఎవరూ లేరని రోడ్డు పై బైఠాయించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్య. మా ఆయన బెటాలియన్ కానిస్టేబుల్. మాకు 19 నెలల బాబు ఉన్నాడు. ఇంట్లో మా అత్తమామలు వయస్సు పైబడ్డవాళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఎక్కువ డ్యూటీలు వేస్తుండటంతో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా అవకాశం రావడం లేదు. 'ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడమే మేలు' అంటూ బెటాలియన్ కానిస్టేబుల్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. బెటాలియన్‌ పోలీసుల వెట్టి చాకిరి పై రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పోలీసుల కుటుంబాలు. నేడు సెక్రటేరియట్‌ ముట్టడించి, ఆందోళనకు దిగిన వారి భార్యలు, కుటుంబ సభ్యులు. గతంలో 15 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తున్నారని, సంవత్సరానికి 3 జిల్లాలు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన అంటూ ప్రజలను రక్షించే పోలీసులనే గోస పెడుతున్న తెలంగాణా ప్రభుత్వం.

Post a Comment

0 Comments