నిబంధనలు బేఖాతరు..?
ఆడువారు లేరు..
కొనుగోలు దారులకు భద్రత కరువు..
చోద్యం చూస్తున్న అధికారులు..
సారపాక ఆదివారం సంత ప్రమాదాల కు అడ్డాగా మారింది..ఎన్ని ప్రమాదాలు జరిగిన అటు సంత నిర్వాహకు నిర్వాహకుల్లో గాని అధికారులు గానీ మార్పు రావట్లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సారపాక సంత నిర్వాహకులకు గ్రామపంచాయతీ నిబంధనలు వర్తించవా లేక పాటించరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రధాన ఎన్ హెచ్ రహదారిపైకి దుకాణాలు యదేచుగా నిర్వహిస్తున్నా పట్టించుకోని అధికారులు కనీస నిబంధనలు పాటించని సంత నిర్వాహకులు దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్న సొంతకు వచ్చే ప్రజలు.అధికారికంగా ఎన్ హెచ్ రోడ్డు బందు చేయాలంటే అనుమతులు ఉంటాయి కానీ వాహనాలతో ప్రధాన రహదారి బంధు చేసిన పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు మాత్రం ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప చర్యలు శూన్యమని విమర్శలు వస్తున్నాయి.
ఏదైనా భారీ ప్రమాదవ సంభవిస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకుంటారా.? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన నిబంధన అమలు చేయాలని ప్రమాదాలకు జరగకుండా అరికట్టాలని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న ప్రజలు.
0 Comments