భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి నేటి నుండి ఘనంగా శ్రీదేవి శ్రీరామాయణ పారాయణ శరన్నవరాత్రి ఉత్సవాలుప్రారంభం అయ్యాయి.తొలిరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అష్టలక్ష్మి అలంకరణలు,సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలక్ష్మి అలంకారం పురస్కరించుకుని అయోధ్యకాండ పారాయణం చేశారు.
ఆదిలక్ష్మి అలంకారం విశిష్టత..లక్ష్మ అంటే గుర్తు అని అర్థం.భగవంతుని గుర్తించడానికి ప్రధాన లక్షణమే అమ్మకు లక్ష్మీ అని పేరు.వేద వేదాంతాలలో కీర్తించబడిన భగవంతుని తత్వాన్ని లక్ష్మీ అమ్మ ద్వారానే గుర్తించడంతో అమ్మకు లక్ష్మీ అని పేరు సార్ధకమైంది.అలా భగవంతుని గుర్తించడానికి ఆలంబమైన లక్ష్మీ తత్వాన్నే ఆదిలక్ష్మి అంటారు.ఈమె చతుర్భుజాలతో రెండు చేతులతో పద్మాలను ధరించి వరద అభయ హస్తాలతో విరాజిల్లుతుంది.

0 Comments