Breaking News

Loading..

'బతుకమ్మ' పేర్లు - పండుగ ప్రత్యేకత.

'బతుకమ్మ' పేర్లు - పండుగ ప్రత్యేకత.


ఖమ్మం, అక్టోబర్ 02, బిసిఎం10 న్యూస్.

బతుకమ్మ పండుగా ఏ రోజు నుండి ఆడుతారు బతుకమ్మ పేర్లు ఏమిటి..?? భాద్రపద అమావాస్య (అక్టోబరు 02) నుండి దుర్గాష్టమి (అక్టోబరు 10) వరకూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

అక్టోబర్ 02 బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య. మొదటి రోజు 'ఎంగిలిపూల బతుకమ్మ' మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది.

అక్టోబర్ 03 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అటుకుల బతుకమ్మ. రెండో రోజు 'అటుకుల బతుకమ్మ' నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు.

అక్టోబర్ 04 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విదియ ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ'.

అక్టోబర్ 05 శనివారం ఆశ్వయుజ శుక్ల తదియ నానే బియ్యం బతుకమ్మ. నాలుగో రోజు 'నానేబియ్యం బతుకమ్మ'.

అక్టోబర్ 06 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మ. ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'.

అక్టోబర్ 07 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ. ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ' ఈ రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు.

అక్టోబరు 08 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్టి వేపకాయల బతుకమ్మ. ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ'.

అక్టోబరు 09 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి వెన్నముద్దల బతుకమ్మ. ఎనిమిదో రోజు 'వెన్నముద్దల బతుకమ్మ'.

అక్టోబరు 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి (దుర్గాష్టమి) సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు 'సద్దుల బతుకమ్మ' జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటుతాయి. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు. దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు, జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్ఛపోయిందట. ఆమెను మేల్కొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట.

బతుకమ్మా అంటూ పాటలు పాడారట. సరిగ్గా పదో రోజు ఆమె నిద్రలేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నాని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

◆ తంగేడును తలకెత్తుకునే రోజు వస్తుంది.

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక టైం తలుపు తడుతుంది. ఇంటిలో మొలిస్తేనే అరిష్టంగా బావించే తంగేడును వెదికి.. వెదికి.. పూలు, ఆకులు తెచ్చి, ముద్దుగా పేర్చి ఇంటిళ్ళిపాదీ మొక్కి, పూజలు చేసి, తలమీద పెట్టుకొని ఊరేగించి గంగమ్మ ఒడికి చేర్చే బతుకమ్మ వేడుకలో గొప్ప సందేశం దాగి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, వారు మాత్రమే అవసరమనే సందర్బం వస్తుంది, కానీ అంతదాక అలిసిపోకుండా, తప్పుకోకుండా, వేచిఉండాలి, పచ్చగా కళకళలాడుతూ దైర్యంగా నిలిచి ఉండాలి. వాళ్ళతో ఏం పనిలే అనుకున్న మనను సమాజం తలకెత్తుకునే రోజు ఖచ్చితంగా.. ఖచ్చితంగా.. వస్తుంది. అంతదాకా అవాంతరాలను తట్టుకొని నిలబడాలి, మరింతగా బలపడాలి గెలిచిచూపించాలి.

'బతుకమ్మ మళ్ళీ.. మళ్ళీ చెపుతుంది నవ్వుతూ బతకడం నేర్చుకోవాలని'. ఎప్పుడూ అదైర్య పడకండి తంగేడును లాగా ఎవరినైనా తలకెత్తుకునే రోజు ఖచ్చితంగా వస్తుందని.

'బిసిఎం10 న్యూస్' వీక్షకులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. 💐💐

 ✍🏽✍🏽..

Post a Comment

0 Comments