భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బసప్ప క్యాంపు నందు 30 అడుగుల రోడ్డు ప్రాంతంలో అవసరమైన చోట కరెంటు స్తంభాలు వేసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సారపాక సబ్స్టేషన్ ఏ ఈ ఉపేంద్రకు స్థానికులు అందజేశారు.
ఈ ప్రాంతంలో కరెంటు స్తంభాలు లేకపోవడం వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి సమయాలు ఈ ప్రాంతంలో రాకపోకలు చేయడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పాములు ,విష జంతువులు సంచరిస్తున్నాయని అందువల్ల భయాందోళన చెందుతున్నట్లుగా ఆయన దృష్టికి సమస్యలు తీసుకువెళ్లారు.
తమ సమస్య పరిష్కారం చేసి ఈ ప్రాంతంలో స్తంభాలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరడం తో ఆయన సానుకూలంగా స్పందించి తన వంతు సహకారాలు అందిస్తానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎండి రహీం, బలగాని పరమేష్, మాసిన రఘుపతి, ప్రమీల, చిట్టూరి కళావతి, లకుమా దేవి, అలెగ్జాండర్ తదితరులు ఉన్నారు.

0 Comments