Breaking News

Loading..

పీడిత ప్రజల నాయకత్వంపై ఇంత దుష్ప్రచారం అవసరమా..!!

పీడిత ప్రజల నాయకత్వంపై ఇంత దుష్ప్రచారం అవసరమా..!!


● మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు వార్త అబద్దం.

● మావోయిస్టు పార్టీ ప్రకటన‌.

హైదరాబాద్, అక్టోబర్ 20, బిసిఎం10 న్యూస్.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి సభ్యురాలు కామ్రేడ్ సుజాత అలియాస్ మైనాభాయి అరెస్టయ్యిందంటూ కొద్ది రోజులుగా జరిగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ప్రజల పై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికే సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు మహిళా అగ్రనేత సుజాతను అదుపులోకి తీసుకున్నామంటూ పాలక వర్గాలు చేస్తూన్న బూటకపు (గోదీ) ప్రచారలను ఖండించండి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కగార్ పేరుతో జరుపుతున్న సాముహిక హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, సామ్రాజ్యవాదుల దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడి ప్రయోజనాలకు అడ్డంకిగా మారిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని నిర్మూలించడానికి కేంద్ర, చత్తీస్ గడ్ రాష్ట్రంలో బిజెపి, తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కటై 'ఆపరేషన్ కగార్' ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నాయకత్వంలో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నత అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపి 2026 మార్చి వరకు మావోయిస్టులను నామ‌ రూపాలు లేకుండా చేస్తామని డేట్ ప్రకటించారు. అందుకుగాను ఉద్యమం పై, ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న వారి పై సామ, దాన, దండోపాయాలు అమలు చేస్తున్నారు. పార్టీ పై దుష్ప్రచారం, అబద్దాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల పై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికి సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఏమిలేదు. అరెస్టు దుష్పాచారం ప్రభుత్వాలు పన్నిన కుట్ర మాత్రమే. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రజల పై పాలక వర్గాలు ఎల్ఐసి దాడులను కొనసాగిస్తున్నాయి. అందులో భాగమే నేడు జరగుతున్న తప్పుడు ప్రచారం. పీడిత ప్రజల నాయకత్వం పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని, ప్రజల్లో గందర గోళాన్ని సృష్టించ‌డాన్ని తక్షణం నిలిపి వేయాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బిజేపి ప్రభుత్వంతో కుమ్మక్కై కార్పోరేట్ల ప్రయోజనాలకు కొమ్ము కాస్తున్నారన్నారు. చత్తీష్ గడ్ లో కార్పోరేట్ల కోసమే పని చేస్తున్నమని బాహటంగా చెప్పుకుంటున్న బిజేపి ప్రభుత్వ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పార్టీ నిర్మూలనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు. కేవలం సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిరోధక పథకానికి తెలంగాణ రాష్ట్ర అనుమతులతో దామగుండంలో విఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఫలితంగా జీవనాడి లాంటి అడవులు, అనేక ఔషధ మొక్కలు, జంతు జాలం, ఉజ్జ్వలమైనా జీవ వైవిధ్యం వింద్వంసం కాబడుతున్నాయి. 20 గ్రామాలు, ఈ గ్రామలలో నివసించే 60 వేల మంది ప్రజలు నిర్వాసితులై చెల్లా చెదురు అవుతున్నారు. బస్తర్ లో పాకృతిక వనరులను కొల్లగొట్టడానికి క్యాంపులు పెట్టి ఆదివాసీ ప్రజల పై దాడులకు పాల్పడుతూ వారిని అడవుల నుండి తరిమి వేయాలనుకుంటున్నారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో పులుల పెంపకం పేరుతో టైగర్ జోన్ నిర్మాణం చేపట్టి ముందు 22 గ్రామాలను, ఆ తరువాత 56 గ్రామాలను, మొత్తంగా 78 గ్రామాల ప్రజల్ని తరతరాలుగా జీవిస్తున్న మాతృ భూమి నుండి ఖాళి చేయిస్తున్నారు. ఇంతటి మానవ హననానికి, పర్యవరణ విధ్వంసానికి పాల్పడుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాశవిక బీజేపీ, కాంగ్రేస్ ప్రభుత్వాలు బస్తర్ లో జల్, జంగల్, జమీన్, ఆత్మగౌరవం కోసం, మా ఊళ్ళో మా రాజ్యం అంటూ అధికారం కోసం పోరాడుతున్న ప్రజల పై, పెసా(1996) చట్టాన్ని అనుసరించి గ్రామ సభను అమలు చేయాలని, హస్ దేవ్, కువ్వేమారి, సుర్జాగడ్, బైలదిల్లా, తరాల్ మెట్ట వంటి స్థానిక ప్రాకృతిక వనరులను కాపాడుకోవడానికి కార్పేట్ సెక్యూరిటీకి వ్వతిరేకంగా పోరాడుతున్న ప్రజల పై, పాలు తాగే పసికూనల నుండి మొదలు కళ్ళు కానరాని ముసలి వాళ్ళ వరకు అందరి పై దాడులు చేస్తున్నారు. ప్రజలకు అండగా నిలిచిన పార్టీ పై, పిఎల్జీఏ పై ఆపరేషన్ కగార్ పేరుతో ఒక్క ఈ పది నెలల్లో నిర్ధాక్షిణంగా కొనసాగిస్తున్న నరహంతక ఫాసిస్టు దాడులలో రెండు వందలకు పైగా మంది మరణించారు. దండ కారణ్యంలో 6 వేలకు పైగా మంది నిర్దోషులు అన్యాయంగా జైళ్ళలో నిర్భంధించబ‌డి సంవత్సరాలుగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. పీడిత ప్రజల పట్ల నిజాయితీ లేని ఛత్తీస్ గఢ్ డబుల్ ఇంజన్(బిజెపి) ప్రభుత్వం చట్టబద్దంగా పోరాడుతున్న బస్తర్ ఆదివాసి హక్కుల నాయకులైన సూరుజ్ టేకాం, పోట్టం సునీత, గజేంద్ర, సురేస్ లాంటి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుంది. ప్రజల పై జరుగుతున్న హత్యలను ఆపాలనీ, అడవులలో మొహరించిన అదనపు సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాము. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లా ముదువెండిలో ఆరు మాసాల చిన్నారి హత్యతో మొదలై నేటికి ఒక ఊచకోత హత్యకాండను సృష్టిస్తున్నారు. హర్రా - రఘునాధనపాలెం, తులి - తులి, పాములూరు, కరున్ గడ్ ఘటనలతో మానవ సంహారాలలో ఆదివాసీ యువతను, రైతులను, విప్లవకారులను స్త్రీ - పురుష భేదం లేకుండా సామూహిక హత్యలకు పాల్పడుతున్నారు. అనేక ఘటనలలో గణనీయమైన సంఖ్యలోనే యువతను కాల్చిచంపి ఎదురుకాల్పులలో మావోయిస్టుల మరణించారని పోలీసులు కల్పిత కథలు చెపుతున్నారు. ప్రతి ఊచకోత తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాటికి సాధికారతను కల్పిస్తూ, దోషులైన పోలీసులను మెచ్చుకుంటూ నరేంద్రమోదీ పాలనలో మావోయిస్టు రహిత భారతం నిర్మిస్తామని గడువు ప్రకటిస్తున్నారు. కానీ బాధిత ప్రజలు వారి శవాలను మోసుకొని వాస్తవాలతో ప్రపంచం ముందుకు వస్తున్నారు. పోలీసుల నేరాలను నమోదు చేయిస్తున్నారు. వారి వెంట జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు నిలిచి క్షేత్రస్థాయి నివేదికలతో నిజాలు వెలికితీస్తున్నారు. ఆదివాసి ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం అడవుల్లోకి జీవిక కోసం అడవి మృగాల బారిన పడకుండా ఆత్మరక్షణ కోసం సాయుధంగా సంచరిస్తుంటారు. కానీ, కగార్ ప్రారంభమైన దగ్గరి నుండి అడవులలో వారి సంచారం పై అప్రకటిత నిషేధం అమలవుతోంది. గ్రామీణ ప్రజలను హత్య చేసిన అనేక సందర్భాలలో కనీసం మృతుల పేర్లయినా ప్రకటించకుండా, శవాల ముఖాలైనా అగుపడకుండా వాటిని పాల్తీన్ షీట్లతో కప్పేస్తూ గుర్తు తెలియని మావోయిస్టుల మరణం అంటున్నారు. శవాల పక్కన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం పెడుతున్నారు. కొన్ని శవాలకు గెరిల్లాల యూనిఫాంలను ఎక్కిస్తున్నారు. పోలీసుల ఈ చట్ట వ్యతిరేక చర్యలన్నీ ప్రజలు వెల్లడి చేస్తున్నారు. కాల్పులతో భీతిల్లి అడవులలోకి పారిపోతున్న రైతులు అప్పటికే పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మొహరించి ఉన్న పోలీసులవలలో చిక్కిపోతూ తమను కాపాడండి అని విజ్ఞప్తి చేసిన వారిని సైతం కాల్చి చంపుతున్నారు. ఊచకోతలతో ప్రజలలో పెద్ద ఎత్తున భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మన దేశ ప్రజలు ప్రభుత్వ కార్పొరేటీకరణకు, సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఫాసిస్టు కగార్ లను నడిపినా, ఎంతటి ఊచకోతలకు పూనుకున్నా చివరకు ప్రజలు తమ న్యాయమైన, వీరోచిత పోరాటాలతో ఫాసిస్టు లెవరికైనా హిట్లర్ గతే పట్టిస్తారని, ప్రజలే విజయం సాధిస్తారని చరిత్ర మరోసారి రుజువు చేసి తీరుతుంది. దేశ, విదేశాలలోని అనేక ప్రజాహిత, ప్రగతిశీల, ప్రజాస్వామ్య, విప్లవ సంస్థలు, శక్తులు ఐక్యమై గత పది మాసాలుగా భారత ప్రజల పై, ముఖ్యంగా మధ్య భారతంలోని దండకారణ్య ఆదివాసి, పిడిత ప్రజల పై కొనసాగుతున్న నిర్ధాక్షిణ్యమైన కార్పొరేట్ పాశవిక కగార్ సైనిక దాడులను, ఊచకోతలను నిర్ద్వంద్వంగా ఖండించండి. ప్రజా యుద్ధాన్ని కాపాడుకొండి. సైనిక కగార్ ఆపరేషన్ ను తక్షణం నిలిపి వేయాలని, దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలని పోరాడండి దేశ సంపదను కాపాడుకోండి అంటూ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటన చేశారు.

Post a Comment

0 Comments