Breaking News

Loading..

'సనాతన ధర్మం' లోను చెడు ఉందా..!!

ఖమ్మం, అక్టోబర్ 20, బిసిఎం10 న్యూస్.

సనాతన ధర్మం అంటే ఇప్పటికి చాలా మందికి పూర్తిగా తెలియకపోవచ్చు. ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, శూద్రులకు కూడా అస్సలు తెలియదేమో. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో 'పూర్తి'గా వివరించే చిన్న ప్రయత్నం ఇది, ఈ వివరణను ఎవరు తప్పుగా తీసుకోవద్దు అని మా మనవి. మీరు చదువుతారా అయితే చదవండి. సనాతన ధర్మం అంటరానితనం అని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయించేవారు అని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట ఊరికి దూరంగా వెలివేసారని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట ఒంటిమీద బట్ట కూడా లేకుండా చేశారని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట తినటానికి తిండి లేకుండా చనిపోయిన మృత కళేబారాలను తిని బ్రతకవలసి వచ్చిందని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట స్త్రీలను వివక్షకు గురిచేసారని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట బాల్య వివాహాలను జరిపించి ప్రోత్సహించారని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిమంటలో వేసి తగలబెట్టే వారని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట శూద్రుడు చదవకూడదని, చదివితే నాలుక కోస్తారని, చదువు వింటే చెవిలో సీసం పోసే వారిని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి కానీ, ఆస్తిపాస్తులు కానీ ఉండకూడదని కట్టు బానిసగా జీవించాలని నీకు తెలుసా. దేవదాసి వ్యవస్థను పెట్టి ప్రోత్సహించింది సనాతన ధర్మం అని మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట సముద్రయానం నీవు చేయకూడదని  నీకు తెలుసా. సనాతన ధర్మ పేరిట  కులాలను బట్టి శిక్షలు అమలు చేసేవారిని  మీకు తెలుసా. సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి పురోహితులు ఇప్పటికి


మంత్రాలు చదువుతున్న నిజం కాదా. సనాతన ధర్మం ప్రకారం చావుల్లో కూడా కులాల పేరిట పురోహితులు సాంగ్యాలు నిర్వహించడం నిజం కాదా.. ఇలా చెప్పుకుంటా పోతే గంటలు చాలవు రండి తెలుసుకుందాం, చర్చించుకుందాం, సనాతన ధర్మం అంతు చూద్దాం. సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు ఉన్నాయి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు జ్ఞాన సముపార్జన, శాస్త్రబోధన, మత విధులను నిర్వర్తంచడం. క్షత్రియుడు ఆయుధాలు ధరించి పరిపాలించడం. వైశ్యుడు వ్యవసాయం, వ్యాపారం చేయడం. శూద్రుడు పై మూడు వర్ణాలకు విధిగా సేవ చేయడం. ఇది శ్రమ విభజన వ్యవస్థగా కొందరికి అనిపిస్తుంది. కాని ఈ వ్యవస్థలో శూద్రుడికి ఆస్తి హక్కు, వేదజ్ణానం, ఉద్యోగం, వ్యాపారం, వ్యసాయం అన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం దాసుడుగా పై మూడు వర్ణాలకు సేవలు చేసి పొట్ట నింపుకోవాలి. ఆ విధంగా సేవలు చేసిన వానికే స్వర్గప్రాప్తి లభిస్తుందని బ్రాహ్మణులు శాస్త్రాలలో పేర్కొన్నారు. ఈ సనాతన ధర్మం, వర్ణవ్యవస్థ శూద్రుల పాలిట శాపాలుగా ఎలా పరిణమించాయో ఇంకా కొన్ని ఉదాహరణలు. పై మూడు వర్ణాల పురుషులు శూద్రవర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించవచ్చు, పెళ్ళాడవచ్చు. అయితే పై వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్ర పురుషుడి నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి లేదా అతడికి మరణశిక్ష విధించాలి (మనుధర్మశాస్త్రం 8:374). బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు (మనుధర్మశాస్త్రం 8:20). ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవువలే కుంగిపోతోంది (మనుధర్మశాస్త్రం 8:21). ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించినా, విన్నా అతని నోటిలో, చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది (మనుధర్మశాస్త్రం 8:272). శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు, శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు  (మనుధర్మశాస్త్రం 3:156). శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు (మనుధర్మశాస్త్రం 4:99). శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికి, అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును (మనుధర్మశాస్త్రం 10:129). బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు, సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు (మనుధర్మశాస్త్రం 8:417). భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి (మనుధర్మశాస్త్రం 1:9). బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరీ పని కూడా దీనికి సాటిరాదు (మనుధర్మశాస్త్రం 10:123). బ్రాహ్మణుడు జీతం భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు (మనుధర్మశాస్త్రం 8:413). ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి (పై మూడు వర్ణాలను) దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది. ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక (మనుధర్మశాస్త్రం 8:270). ద్విజుల (పై మూడు వర్ణాల) యెక్క పేర్లు, కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి (మనుధర్మశాస్త్రం 8:271). బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా, క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా, వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి (మనుధర్మశాస్త్రం 2:32). బ్రాహ్మణుల ఇంటి పేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటి పేరు శక్తిని చూపేదిగా, వైశ్యుల ఇంటి పేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి. శూద్రుల ఇంటి పేరు హేయమైనదిగా ఉండాలి (మనుధర్మశాస్త్రం 2:31).


● సనాతనధర్మంలో - యజ్ఞయాగాలు.

పూర్వం గోబలి లేని యజ్షయాగాలు ఉండేవి కావు. సువిశాలమైన యజ్ఞశాలలు నిర్మించి పురోహితుల మంత్రధ్వానాల మధ్య గోవధతో పాటు అనేక జంతుబలులు జరిగేవి. యజ్ఞంలో పాలు, ధాన్యాలు, నెయ్యి, మాంసం, సోమరసం దేవతలకు నైవేథ్యంగా నివేదన చేసిన తరువాత వేద బ్రాహ్మణులు సోమరసాన్నిమత్తుగా త్రాగి, బలిచ్చిన గోమాంసం భుజించేవారు. అందుకు సాక్ష్యం వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది, ఇవే ఋజువులు. 'అధో అన్నం వాయ్ గోవా' - వాస్తావానికి గోవు మన ఆహారం (ఐతేరియ బ్రహ్మణ్యం: 111.9.8). 'మాంసం లేకుండా మధువును తీసుకోవడం సాధ్యం కాదు' (ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4). పండితుడు, ప్రసిద్ధుడు, సామాజికుడు, శ్రోతలున్న వక్త, వేదపాటి, దీర్గాయుష్మంతుడు అగు పుత్రున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును (బృహదారణ్యకం). 'వయస్సులో ఉన్న దూడ మాంసం కానీ, లేదా ముదురు వయస్సులో వున్న ఎద్దు మాంసం కానీ భుజించాలి' (శంకారాచార్యులు). 'నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను' (యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం). భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు (రామాయణం). ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు (మనుధర్మ శాస్త్రం - 35వ సూక్తం). ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు, పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు (కౌటిల్యుని అర్ధశాస్త్రం). ఉత్తర క్రియలలో (దశదిన కర్మలో) భాగంగా ఆవునో, ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు (రుగ్వేదం 10,14 -1). రంతి దేవుని వంటగదిలో ఆవును వధించి ధాన్యంతో పాటు మాంసం వడ్డించేవారు (అధర్వణ వేదం 11.2 , 4). ఇంద్రునికి, శివునికి గోవులు బలివ్వాలి, గర్భిని స్త్రీలు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు (యాజ్ఞవల్క స్మృతి). వీటన్నింటికి సాక్ష్యాలు పైన చెప్పినవే, మరి అందరు మర్చిపోయిన సనాతన ధర్మం మూలాలను తవ్వుకొని మరీ అనుసరిద్దామా..??

Post a Comment

0 Comments