Breaking News

Loading..

'ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల'లో అధిక ఫీజుల వసూళ్ల పై స్పందించండి సార్లు..!!

'ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల'లో అధిక ఫీజుల వసూళ్ల పై స్పందించండి సార్లు


..!!

పాల్వంచ, అక్టోబర్ 20, బిసిఎం10 న్యూస్.

పాల్వంచ పట్టణ జెఎన్టియూ అనుబంధ ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో అధిక ఫీజుల వసూళ్ల పై స్పందించాలని కోరుతూ పలుమార్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజావాణిలో వినతి పత్రాలు అందజేసిన సంబంధిత అధికారులు స్పంచడం లేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవాలి అంటే తల్లిదండ్రులు 'చదువుని కొనాల్సిన' పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు ఫీస్ రేయింబర్స్మెంట్ పేరుతో ప్రోత్సహించినా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఆశించిన స్థాయిలో ఇంకా విద్యాబోధన మెరుగు పడలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక వెసులుబాటు లేకపోయినా అప్పుచేసైనా తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే తపనతో ప్రైవేటు కళాశాలల వైపు ఆసక్తి చూపుతున్నారని 'ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలి' అన్న సామెతగా బేసిగ్గా ఈ పాయింట్ పైనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కశాల యజమానులు విద్యను వ్యాపారంగా మార్చుకున్నారు. అలాగె సదరు ఇంజనీరింగ్ కళాశాలలో మెరుగైన సాంకేతిక విద్య పేరుతో లైబ్రరీ కి అని, ల్యాబ్ కి అని, డెవలప్మెంట్ కి అని, అటెండన్స్ కి అని, ల్యాబ్ అటెండన్స్ కి అని, ఇంటర్నల్ కి అని డిపోసిట్స్ రూపంలో యూనివర్సిటి సూచించిన సూచించని దానికంటే ఎక్కువగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారన్నారు. చివరికి నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు కొనుగోలుకు సంబంధించి పలానా రికార్డ్స్ నే పలానా షాపులోనే కొనాలని అధిక రేట్లకు తాము ఒప్పందం చేసుకున్న బుక్ షాపులు, జిరాక్స్ సెంటర్లోనే కొనేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇంకా కళాశాలల్లో గాలి వెలుతురు, మరుగుదొడ్లు, అవసరమైనన్ని ల్యాబ్స్ ఇతర మెరుగైన సౌకర్యాలు కూడా కొరవడ్డాయన్నారు. యూనివర్సిటి లేదా సంబంధిత అధికారులు వెంటనే ఈ విష్యాల పై స్పందించాలని వారు కోరారు.

Post a Comment

0 Comments