'శ్రీ విద్యానికేతన్' స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
ఖమ్మం, అక్టోబర్ 01, బిసిఎం10 న్యూస్,
ఖమ్మం టిఎన్జిఓస్ కాలనిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు వారి తల్లిదండ్రుల చేత బతుకమ్మలను అందంగా అలంకరించుకొని పాఠశాలలో బతుకమ్మ ఆటలాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆశ్వయుజ మాసంలో దేవినవరాత్రుల వైభవం గురించి, తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు, ఆ రోజు చేసే నైవేద్యాలను గురించి, దసరా పండుగ యొక్క విశిష్టతను గురించి అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులకు చక్కగా వివరించారు. న్యాయనిర్ణేతలుగా స్కూల్ డైరెక్టర్ వెంకట సత్యనారాయణ, ప్రిన్సిపాల్ శ్రీలక్మి, వైస్ ప్రిన్సిపాల్ షెహనా వ్యవహరించారు. ఈ వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.

0 Comments