Breaking News

Loading..

తిరుపతి లడ్డు కల్తీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం.


తిరుపతి లడ్డు కల్తీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం.

తిరుపతి, అక్టోబర్ 01, బిసిఎం10 న్యూస్.

తిరుపతి లడ్డు పై ఎపి సిఎం చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా అంటూ ప్రశ్నించింది. నెయ్యి కల్తీ పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా..?? లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్‌ ల్యాబ్‌కు పంపించారా.?? లడ్డూను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు..?? సెప్టెంబర్‌ 18వ తేదీ నాటి సీఎం ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా..?? కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ వాడకంలో వాడినట్లు ప్రాథమిక ఆధారాల్లేవు, అలాంటప్పుడు నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపించండి అంటూ చంద్రబాబు పై సీరియస్ అయ్యింది. జులైలో రిపోర్ట్‌ వస్తే, సెప్టెంబర్‌లో చెప్పారెందుకు.?? సిట్ ఎందుకు వేశారు.?? ఈ విచారణ సరిపోతుందా..?? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి అని మందలించింది. అక్టోబర్‌ 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.

◆ టీటీడీ తరఫు లాయర్‌ పై ప్రశ్నల వర్షం.

నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా. నెయ్యి రిజెక్ట్‌ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా. ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా. జులైలో రిపోర్ట్‌ వస్తే సెప్టెంబర్‌లో చెప్పారెందుకు..?? ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు..?? మైసూర్‌ లేదంటే గజియాబాద్‌ ల్యాబ్‌ల నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు..?? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవు. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా..?? అని టీటీడీ లాయర్‌ సిదార్థ్‌ లూథ్రాను ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా..?? ఉంటే చూపించండి. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదు..?? ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు..?? సెకండ్‌ ఒపీనియన్‌ కు ఎందుకు వెళ్లలేదు.

కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?? లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు..?? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు..?? నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్‌ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ఇరువైపులా వాదనలను రికార్డ్‌ చేసిన అనంతరం, తదుపరి విచారణను అక్టోబర్‌ 3వ తేదీకి గురువారంకు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments