Breaking News

Loading..

సినిమా ధియేటర్లో నిలువ దోపిడి.. ఆర్డిఓ కి వినతిపత్రం

 భద్రాచలం ఆర్డీవో గారికి తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.అజీం వినతి పత్రం అందజేశారు 


 కనీస మౌళిక సౌకర్యాలు కల్పించకుండా, అధిక ధరలకు టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ ప్రేక్షకుడిని నిలువుదోపిడి చేస్తున్న సినిమా థియోటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొనుట గురించ

ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని సినిమా థియోటర్లు కనీస నిబంధనలు పాటించడం లేదు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు దోచుకున్నోడికి దోచుకున్నంత అన్న చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ల ధరలు అమాంతం పెంచుతూ థియోటర్కు వెళ్ళిన ప్రేక్షకుడికి టిక్కెట్లు లేవని చెబుతూ, మొత్తం టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా సుమారు రూ.200ల నుంచి రూ.500లకు విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడి చేస్తున్నారు. కనీసం వాహనాలు పార్కింగ్ చేసే సౌకర్యం సక్రమంగా లేదు. మరోపక్క పార్కింగ్ పేరుతో ప్రేక్షకుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్ళు చేస్తున్నారు. ఏసిల పేరుతో అధిక టిక్కెట్లు వసూళ్ళు చేస్తున్న థియోటర్ యాజమాన్యాలు కనీసం కూలర్లు, ఫ్యాన్లు సైతం సక్రమంగా వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వందల రూపాయలు వెచ్చించి కుటుంబ సమేతంగా చిన్నారులతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సినిమాలో లీనం కావడంతోనే అంటే సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే సదరు యాజమాన్యాలు వారు వేస్తున్న కూలర్లు, ఫ్యాన్లను సైతం ఆపివేసి మళ్ళీ సినిమా ఇంటర్వెల్ సమయంలో, సినిమా వదిలే సమయంలో మాత్రమే వేస్తున్నారు. అంటే అడుగడుగునా ప్రేక్షకుడిని దోపిడీకి గురి చేస్తున్నారు. మరోపక్క తినుబండారాలు, కూల్ డ్రింక్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారు ఇచ్చిందే తీసుకునే విధంగా, వారికి నచ్చిన బ్రాండ్లను థియోటర్ లోపల విక్రయిస్తున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ను రూ.30 నుంచి రూ.40ల వరకు విక్రయిస్తున్నారంటే వీరి దోపిడి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా, కనీసం లైసెన్స్ సైతం రెన్యువల్ చేయకుండా థియోటర్ నిర్వహణ సాగిస్తున్నారు. సామాన్యులకు వినోదాన్ని దూరం చేస్తూ ఏజన్సీ ప్రాంత గిరిజనులను దోచుకుంటూ, నిబంధనలు పాటించని థియోటర్ యాజమాన్యాలపై మరియు డిస్ట్రిబ్యూటర్స్పై తగు చర్యలు తీసుకోవాలని తమరిని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే అధికారులు భద్రాచలంలో ఏజన్సీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సినిమా థియోటర్లను తనిఖీలు చేయాలని, సత్వరమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయాలను నిలిపివేసి, నేరుగా థియోటర్కు వెళ్ళిన ప్రేక్షకులకే టిక్కెట్లు ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు..



Post a Comment

0 Comments