Breaking News

Loading..

వావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవ పై అవగాహన ర్యాలీ..


ప్రభుత్వ పిలుపుమేరకు స్వచ్ఛత సేవ 2024 పేరుతో ఐటీసీ సౌజన్యంతో వావ్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తడి చెత్త పొడి చెత్త కాలువలలో డ్రైనేజీలలో బహిరంగ ప్రదేశంలో వేయకుండా పంచాయతీ వారి చెత్త టాక్టర్ లోని వేయాలని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేయాలని సారపాక గ్రామంలోని మైనార్టీ విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఐటిసి హెచ్ఆర్ జిఎం చంగల్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో వావ్ సంస్థ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు వావ్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



Post a Comment

0 Comments