ఖమ్మం పట్టణం లో వర్షం బీభత్సము.. చెరువు కు గండి .ఇళ్లలోకి వరద నీరు ..
ఇళ్లలో సమాలను బయట వున్న కాలనీ వాసులు
వర్షపు నీరు ఇంట్లోకి ప్రేవేశించటం తో నానా ఇబ్బందులు
పట్టించునే వారు లేక బిక్కు బిక్కు మంటూ అవస్థలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి .. వాగులు వంకలు పొంది పొర్లుతున్నాయి .. అనేక చోట్ల రహదార్లు మునిగిపోయి రవాణా సౌకర్యాలు నిలచిపోయాయి .. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి అని వాతావరణ శేఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు .
వైరావద్ద వాగు పొంగి రోడ్డు పైనుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి . ఖమ్మం పట్టణం లో సాయినగర్ వద్ద చెరువు కట్ట తెగడంతో ఇళ్లలోకి మనిషిలోతు నీరు వచ్చి చేరింది.. ఒక్కసారిగా వరద రావడంతో ప్రజలు ఎక్కడివి అక్కడ వదిలేసి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు .. అధికారులు సహాయచర్యలు చేపట్టారు ..


0 Comments