Breaking News

Loading..

మనందరి కృషితోనే సమాజంలో మార్పు - అస్పియా అంజుమ్.

ఖమ్మం, సెప్టెంబర్ 13, బిసిఎం10 న్యూస్,


మనందరి కృషితోనే సమాజంలో మార్పు సంభవిస్తుందని, అందుకుగాను మనమంతా సంఘటితంగా నిర్విరామ కృషి చేయాలని జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'నైతికతే నిజమైన స్వేచ్ఛ' అంశం పై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జాగృతి ఉద్యమంలో భాగంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లను, పలు పాఠశాలలు సందర్శించి ప్రిన్సిపాల్ లను కలుసుకొని మాట్లాడారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశం పై, స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి, అలజడులకు గురవుతుందన్నారు. మన నైతిక, సామాజిక బాధ్యతల ప్రకారం చిన్నప్పటి నుండే పిల్లలకు నైతిక విలువల గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పతనమవుతున్న సమాజంలో మార్పు కోసం జమాతే ఇస్లామీ హింద్ ప్రచార ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు సుమయ్య తరున్నం, నూరి హప్ష, ఫైజా ఇరం, సీమ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments