భద్రాచలం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు ఈ ఈ సభకు వివిధ పార్టీ నేతలు మేధావులు విద్యావేత్తలు హాజరై సీతారాం ఏచూరి లేరు అన్నది జీర్ణించుకోలేని విషయమని ఇది కేవలం శిబిరంపాటికి కాకుండా ఒక ప్రపంచానికే ఒక మేధావి కోల్పోయిన పరిస్థితి అని సీతారాం మీచూరి వ్యక్తి కాదని శక్తి అని తమతో ఉన్న తీపి జ్ఞాపకాలని పంచుకున్నారు
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశం ఒక మేధావిని కోల్పోయిందని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని ఆయన లేని లోటు తీర్చలేనిది అని ఏచూరి గారి ఆశయ సాధనకై తమంత కృషి చేస్తామన్నారు
సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఉత్తమ పార్లమెంటు ఎన్నిక రెండుసార్లు ఎన్నికైన ఏకైక పార్లమెంట్ సభ్యులు సీతారాం ఏచూరి. ఇది మనకు ఎంతో గర్వకారణం అని అన్నారు అంతేకాకుండా ఎమర్జెన్సీ టైంలో ఇందిరా గాంధీని ఎదిరించి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని రాజకీయాలు అతీతంగా అభిమానింపబడే ఏకైక నాయకుడు అని అన్నారు.
0 Comments