ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వై మంగయ్య ,ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, కోశాధికారి డి కృష్ణమూర్తి గార్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం వి ఎస్ ఎస్ నారాయణ. నాయకులు మాదిరెడ్డి రామ్మోహనరావు ,ఎస్ రాజబాబు. టి శివప్రసాద్, నాళం సత్యనారాయణ గార్లు పూలదండలు వేసి నివాళులు అర్పించారు.ఎస్ రాజబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని శ్లా ఘిస్తు మాట్లాడారు. ఇంకనూ మాదిరెడ్డి రామ్మోహనరావు ఎంవిఎస్ నారాయణ కే ఎస్ ఎల్ వి ప్రసాద్ డి కృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు. తరువాత కార్యక్రమానికి హాజరైన నరసింహారావు, బి రాజు, కన్నయ్య లాల్, వి రాంబాబు, వీరభద్రరావు, జివి రమణ, అక్కయ్య, నిర్మలానందం, తదితరులు చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం పెన్నులు మరియు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
0 Comments