భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకున్న మహబూబాబాద్ ఎంపీ శ్రీ కోరిక బలరాం నాయక్. అనంతరం గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించారు, వీరి వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పోరిక బలరాం నాయక్ గారు ప్రెస్ మీట్ నిర్వహించి, భద్రాచలం స్థానికంగా ఉన్న పనులను గుర్తించి, కరకట్ట ఎత్తు పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు.పోలవరం ప్రాజెక్టుతో ముంపుకు గురవుతున్న కొన్ని గ్రామపంచాయతీలను కాపాడుకునే దిశలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి తో కలసి కరకట్ట పటిష్ట పరిచే కార్యక్రమం చేస్తాం అన్నారు.
భద్రాచల ప్రాంత ప్రజలకు సుభిక్షమైన పాలన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందిస్తామని ముంపుకి గురికాకుండా పోలవరం బ్యాక్ వాటర్ తో ఇబ్బంది లేకుండా, పటిష్టమైన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రతి సంవత్సరం స్లూయిజ్లు వల్ల గోదావరి పట్టణ ప్రవేశించడం స్థానికంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండటంతో, దానిపై కూడా అధికరుణాలు నేవైదిక పంపని త్వరితిగతిన అసమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలం నుండి వెంకటాపురం వరకు రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు, దీనికి 30 కోట్ల రూపాయలు అవసరమవుతుందని ,ఈఎంసి చీప్ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ,ఈ పనిని భద్రాచలం టు వెంకటాపురం వరకు రోడ్లు విస్తరణ చేసి రవాణాకు ఇబ్బంది లేకుండా చేయవలసింది బాధ్యత స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలకు మాకు ఉందని వారు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ A. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, భద్రాచల అభివృద్ధికి, భద్రాచల సీతారామచంద్ర స్వామివారిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే పనిలో ముందుంటానని తెలిపారు.
0 Comments