![]() |
| ఆదివాసీలకు తప్పని జడ్డీ మోతలు |
బట్టిగూడెం గ్రామానికి చెందిన గర్భిణీలు రవ్వ దేవి, సుబ్బమ్మ లకు పురిటి నొప్పులు వస్తుండడంతో గమనించిన ఆశావర్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రామస్తుల సహకారం కోరింది
సరైన రహదారి లేకపోవడంతో పురిటి నొప్పులు పడుతున్న గర్భిణీ స్త్రీలను ఇద్దరినీ మంచాలను తిరగేసి జడ్డీలాగా తయారు చేసి 8 కిలోమీటర్లు మోసుకొచ్చి ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.
గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ తేదీలకు కొన్ని రోజులు ముందుగానే ఆసుపత్రికి చేర్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పురిటి నొప్పులు పడేంత వరకు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బందిపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

0 Comments