Breaking News

Loading..

గంగమ్మ చెంతకు గణనాథులు

 

భద్రాచలం గోదావరి నది తీరం కోలాహులంగా మారింది తొమ్మిది రోజులు విశిష్ట పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడిలో చేరడానికి సిద్ధమయ్యాడు ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఏ ఎస్ పి అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరి నిమజ్జనా ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎండిఆర్ఎఫ్ సిబ్బంది మరోవైపు గజ ఈతగాళ్లు తో భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.

 ఈరోజు ఉదయం నుంచి సుమారు 400 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు తెలిపిన అధికారులు. గత సంవత్సరం దాదాపు 20200 పైచిలుకు విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు తెలిపారు ఈ సంవత్సరం సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని గంగమ్మ ఒడిలోకి చేరబోయే గణనాథుని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడికి అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది. నిరంతర పర్యవేక్షణ మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు.





Post a Comment

0 Comments