Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

 

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని అక్టోబర్ 1వ తేదీన భద్రాచలం లోని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయము నందు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం భద్రాచ లం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారుఆరోజు వయోవృద్ధులకు గౌరవిస్తూ ఉచిత రీతిన శాలువులతో, పూలదండలతో, బొకేలతో సన్మానించడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమం అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించి 12:30 కల్లా కార్యక్రమం ముగిస్తుంది వయోవృద్ధులు అవటం చేత అనుకున్న సమయానికే కార్యాలయానికి చేరుకోవాలని సన్మాన కార్యక్రమాల అనంతరం వయోవృద్ధ పౌరులకు వైద్యపరమైనటువంటి మద్దతు. ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వం చే పూర్తిగా లేదా పాక్షికంగా నిధులు పొందుతున్న ఆసుపత్రులు సాధ్యమైనంత వరకు వయోవృద్ధులందరికీ పడకలను సమకూర్చాలి. అలాగే వయోవృద్ధుల కొరకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలి తదితర అంశాలపై చర్చించటం జరుగుతుంది. కావున పై కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.  పెన్షనర్లు మరియు వయోవృద్ధులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కే ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికా D కృష్ణమూర్తి. ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఎంవీఎస్ నారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షులు వై మంగయ్య. నాయకులు సుబ్బయ్య చౌదరి. రాజబాబు, శివ ప్రసాద్, నాళం సత్యనారాయణ. బి రాజు. సుధాకర రెడ్డి. అక్కయ్య. పంపన సత్యనారాయణ, మాదిరెడ్డి రామ్మోహనరావు. బి నరసింహారావు, దుర్గాప్రసాద్, కే జగన్మోహనరావు. నిర్మలానందం, తదితరులు పాల్గొన్నారు. 




Post a Comment

0 Comments