Breaking News

Loading..

ప్రపంచానికి పెను శాపం 'సోషల్ మీడియా ఆప్స్ అల్గోరిథం'.

ప్రపంచానికి పెను శాపం 'సోషల్ మీడియా ఆప్స్ అల్గోరిథం


'.

ఖమ్మం, సెప్టెంబర్ 28, బిసిఎం10 న్యూస్.

ఈ సోషల్ మీడియా అప్స్, గూగుల్, యు ట్యూబ్ మనం ఏదైనా ఒక ఇష్యూ మీద ఒకట్రెండు వీడియోస్ చూస్తే ఇక దాన్ని మన ఇంటరెస్ట్ జాబితాలో వేసేసి అవే చూపిస్తుంటాయ్. ఇక దాంతో  యూజర్స్ కి ఆ ఒక్క విషయమే అప్పటికి ప్రధానమై కూర్చుంటుంది.

హిందువులని మసీదులోకి లాక్కెళ్లి చంపిన వీడియో ఒకటి క్లిక్ చేసి చూసాము అనుకోండి ఇక మనకి హిందువులని కొడుతున్న, తిడుతున్న, చంపుతున్న వీడియో లు ఎక్కువ వస్తాయ్. అలాగే ముస్లింలని చంపిన హిందువుల వీడియో ఒకట్రెండు చూసాం అనుకోండి ఇక అన్నీ అవే వీడియోస్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఇక అటు అలా చూసిన ముస్లిం అబ్బాయ్, హిందూ అబ్బాయ్ లో కూడా అభద్రతా మొదలువుతుంది. వాళ్ళకి అవే పదే పదే కనిపిస్తూ ఉంటాయి. నెమ్మదిగా మనం ఆ ఆవేశంలో కామెంట్ లు పెట్టడం తిట్టడం మొదలు పెడతాడు. ఇక అల్గోరిథం మనకి ఇది తప్ప వేరే ఇంట్రేస్ట్ లేదు అని ఫిక్స్ అయిపోతుంది. ఇక పంపింగ్ ఇంకా పెరుగుతుంది ఎక్కడికెక్కడి విషయాలు రికమెండ్ చేస్తూ చూడు చూడు అంటుంది. మనం చూస్తూ చూస్తూ ఉంటాం. చివరకి ఒక హిందూ బత్తాయిగా, ముస్లిం బత్తాయిగా, క్రైస్తవ బత్తాయిగా తేలతాం.

ఒకట్రెండు అసభ్య రీల్స్ చూడడం వళ్ళ అవే కనిపించేసరికి ఇక ఆడవాళ్లు అంతా నెట్ లో అసభ్య  రీల్స్ చేస్తున్నారు అని భ్రమపడిపోతాం, ఇక స్త్రీ ద్వేషిగా తేలతాం.

టిడిపి గాంగ్, వైస్సార్సీపీ గ్యాంగ్, గులాబీ సైన్యం, మోడీ సేవకులు అంతా ఇలా తమ విధానానికి భావాలకి అనుకూలమైనవి చూసి చూసి చూసి అవే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యిపోయి హార్డ్ కోర్ పార్టీ బత్తాయిలు అయిపోతాం, అదెంత మూర్ఖంగా ఉంటుంది. అసలు ప్రజలకి సేవ చేయడానికి వచ్చి ఇంత మంచి చేసిన మనిషి ఇలాంటి పనులు చేస్తారు అంటే ఎలా నమ్ముతారు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటాం. గమనించారా ఇప్పుడు ప్రతీ మనిషి ఎదో ఒక విద్వేష సమూహంలో ఆక్టివ్ గా ఉంటాడు. హైందవ ద్వేష సమూహం, ముస్లిం ద్వేష సమూహం, ఫెమినిజం వల్ల లేడీస్ బరితెగించారు అనే సమూహం, పార్టీ సమూహాలు ఇలా ఎదో ఒక విషయంగా ద్వేషం మీద కనీసం కొంత సమయాన్ని ఖచ్చితంగా వెచ్చిస్తున్నాం. ఆఖరికి రచయితలూ అతీతంగా లేరు. వాళ్ళూ ట్రాప్ లో పడి ఏదైనా రాయాలి అంటే ముందు తమ ద్వేషానికి అనుకూలమైన ఒక ప్లాట్ అనుకోని దాని చుట్టూ కథలో కవితలో చుట్టేస్తారు. అందులో ద్వేషం సగం కదా సగం. చదువుతూ ఉంటే సన్నివేశాలు పాత్రలు కనపడేవి ఒకప్పటి రచనల్లో ఇప్పుడు కేవలం భావజాలమే కనిపించి పేలవంగా అనిపిస్తున్నాయి. నిజానికి వీళ్ళెవరూ చెడ్డవాళ్లూ లేదా  మూర్ఖులు కాకపోవచ్చు. ఇదిగో మొదట అల్గోరిథం లో చిక్కుకొని, తర్వాత తమకి అనుకూలమైన ద్వేష సమూహంలో కంఫర్ట్ గా కుదురుకుని మన మందతో పాటు ప్రత్యర్థి సమూహం మీద మాటల రాళ్లు వేస్తూ 'తగిన బుద్ది చెప్తున్నాం' అని ఫీల్ అవుతూ ఉంటాం. వీటి మీద మనకి కొంత అవగాహన వస్తే వీడియోలు, రీల్స్  చూసి ప్రపంచ అంతా ఇలా ఉంది అని అనుకునే బదులు, ఎహె వీడు ఇదే చూపించి చావగొడుతున్నాడు అని లైట్ తీసుకొని ఇంకోటేదో పాటేసుకొని మూవ్ ఆన్ అయిపోదాం. ఈ సోషల్ మీడియా అప్స్ అల్గోరిథం ట్రాప్ లో ఇరుక్కోకుండా ఉందాం అన్నది మా అభిప్రాయం.

Post a Comment

0 Comments