సామాన్యులకు బిగ్ షాక్..!!
◆ భారీగా పెరిగిన ధరలు.
ఖమ్మం, సెప్టెంబర్ 28, బిసిఎం10 న్యూస్.
సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. వంట నూనె ధరలు లీటర్ పై రూ 20 నుండి రూ 45 వరకు, వెల్లుల్లి కిలో రూ 300 నుండి రూ 360, అల్లం కిలో రూ100 నుండి రూ 150, ఎండుమిర్చి రూ 200 నుండి రూ 240, పెసరపప్పు రూ 150, మినపప్పు రూ 135, కందిపప్పు రూ 150 నుండి రూ 175 కు పెరిగాయి. ఉల్లి ధర కేజీ రూ 60 కి తగ్గడం లేదు. నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

0 Comments