Breaking News

Loading..

వినూత్నంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు..

 విద్యార్థులే ఉపాధ్యాయుల వలె పాఠశాలను నడిపిస్తారు. పలు సబ్జెక్టులను బోధిస్తూ తోటి విద్యార్థుల ప్రశంసలు, ఉపాధ్యాయుల ఆశీర్వచనాలు పొందారు. ఇందులో భాగంగా గురుపూజోత్సవం సెప్టెంబర్ 05 నాడు చర్ల మండలంలోని తిప్పాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల(ఎంపి యుపిఎస్) విద్యార్థులు... ఉపాధ్యాయులు పాఠశాలకు రాక ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సరికే కేక్ తెప్పించి ఒకింత ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేశారు.

ఉపాధ్యాయుల చేత కేట్ కట్ చేసి విద్యార్థులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వినూత్న రీతిలో గురువులను సత్కరించిన తిప్పాపురం పాఠశాల విద్యార్థులు ఆయా ఉపాధ్యాయుల మదిలో చిరకాల స్వప్నంగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.



Post a Comment

0 Comments