ఐదు నెలల నుండి వేతనాలు లేక మిషన్ భగీరథ కార్మికుల ఆందోళనలు
మణుగూరు, మిట్టగూడెం రధంగుట్ట లో మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు. పోచంపాడు కంపెనీ వారు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ పోచంపాడు కంపెనీలో పని చేస్తున్న 40 ఎం.ఎల్.డి కార్మికులు ఐదు నెలలు గా జీతాలు రానిపక్షంలో సెప్టెంబర్ 3 నుండి నిరసనలు భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నాలుగో రోజు అర్ధనగ్న ప్రదర్శన చేసారు, ఎనిమిదవ రోజు నీటిని నిలిపివేసి విధులు బహిష్కరిస్తామని తెలిపారు. వేతనాలు సరిగా రాక బయట అప్పు పుట్టక, కుటుంబపోషణకు ఇబ్బందులు పడుతున్నాం అని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని ఉద్దేశంతో 43,791 కోట్ల బడ్జెట్ తో గత బిఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథ ను ప్రారంభించింది. 16,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు.కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.19 వేల జీతం ఇస్తుంటే పోచంపాడు కంపెనీ కంపెనీ, అధికారులు కుమ్మక్కై రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. జీతాల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని మేనేజర్‌ను నిలదీశారు. ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులు కోరారు.

0 Comments