భద్రాచలం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ..అమరజీవి కామ్రేడ్ టివిఆర్ చంద్రం 17 వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు .
కామ్రేడ్ చంద్రం భద్రాచలం డివిజన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి పార్టీ శాఖ కార్యదర్శి .రెండు దశాబ్దాలుపైగా ఆడివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. నిజాయితీ నిరాడంబరతకు నిలువెత్తు రూపం కామ్రేడ్ చంద్రం.
ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపని వ్యక్తిత్వంవారిది. భద్రాచలం డవిజన్ లో పార్టీ విస్తరణకు తన టీమ్ తో నాయకత్వం వహించారు.అనతికాలంలోనే గిరిజన గిరిజనేతర ప్రజల అభిమానం చూరగొన్నారు .
వారు నిర్వహించిన బాధ్యతలు కృషి గురించి గతంలో చెప్పుకునాము. 17 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమైన విషయం
మిత్రులతో పంచుకోదలచాను.
1955 ,శాసనసభ ద్విసభ్య నియోజకవర్గం జనరల్ నుండి కామ్రేడ్ యండి తహసీల్ యస్ టి నుండి కామ్రేడ్ శ్యామల సీతారామయ్య గార్లు ఎన్నికయినారు. కామ్రేడ్ సీతారామయ్య గారి వయసు రోజులు తేడా ఉండటంతో వారి ఎన్నికను కొట్టివేశారు.యస్ టి అభ్యర్థి వరకు జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో ఆనాటి ముఖ్య మంత్రి
శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ప్రతిష్టాకరంగా తీసుకుని ప్రచారం చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి వాణిరమణారావు గెలిపించారు. 1962 ఎన్నికలలో ఆనాటి డివిజన్ నాయకులు చంద్రం గారిని శాసనసభకు పోటి చేయాలని కోరగా తాను పార్టీ నిర్మాణం కోసమే పని చేస్తాను తప్ప ఎన్నికలలో నిలబడనని తిరస్కరించారు .తిరిగి రెండవ విడత కామ్రేడ్ తహసీల్ గారు విజయం సాధించినారు.
1964 లో కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో కామ్రేడ్ చంద్రం సిపియంతో ఉన్నారు .
కమ్యూనిస్టు పార్టీ చీలిక వలన రెండు పార్టీలు పోటీలో ఉండటంతో 1967 ,1972 ఎన్నికలలో కాంగ్రెసు వరస విజయాలు సాధించింది .తర్వాత మారిన పరిస్థితులలో 1978 ఎన్నికలలో ఒక వైపు కాంగ్రెసు మరియు ఇందిరా కాంగ్రెసులు పోటీతో కాంగ్రెసు ఓటు నిలువునా చీలటంతో జనతాపార్టీ మద్దతుతో సిపియం నుండి కామ్రేడ్ ముర్ల యర్రయ్య రెడ్డి గారు 2 వేల మెజారిటీతో విజయం సాధించినారు.ఈ ఎన్నికల నిర్వహణలో కామ్రేడ్ చంద్రం గారు ఒకెే ఒక్క Willy's పెట్రోల్ జీపుతో పార్టీ నాయకత్వం కేడర్ మిత్రపక్షాన్ని సమన్వయం చేసి ప్రచారానికి సారధ్యం వహించారు . తర్వాత 1983 సిపిఐ సిపియం ఆతదుపరి మిత్రపక్షాల మద్దతుతో 2009 మినహా 2019 వరకు వరస విజయాలకు 1978 విజయం పునాదిగా నిలచింది అనటం అతిశయోక్తి కాజాలదు.
ఈ ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థిగా వెంటాపురం జమిందారు బాబు (రామక్రిష్ణం రాజు) నామినేషన్ వేశారు .తన తల్లి తరపు వారు బస్తర్ లో యస్ టి కనుక తాను యస్ టి ని అని సర్టిఫికేట్ సంపాదించి వాదించారు .
జమిందారు బాబు ఆప్రాంతంలో పలుకుబడి గల వ్యక్తి .ఎందుకంటే మన రాష్ట్రం అంతా 1948 ఎస్టేట్ ఎబాలిషన్ యాక్ట్ తో ఎస్టేట్లన్ని రద్దయినాయి.విచిత్రమేమంటే వెంకటాపురం ,ఆలుబాక ,చర్ల ఎస్టేట్లు మాత్రం 1970 వరకు కొనసాగాయి .అందుకే భూసమస్యలు మిగతా ప్రాంతానికి ఈ ప్రాంతానికి తేడాగా ఉండేవి.
జమిందారు బాబు నామినేషన్ చెల్లదని అడ్వకేటుని పెట్టి వాదించి స్క్రూటినిలో కొట్టి వేయించారు కామ్రేడ్ చందం .జమిందారు అక్కడితో ఆగకుండా తన నామినేషన్ చెల్లుబాటు కోరుతూ కోర్టుకెళ్లారు. దానిపై కామ్రేడ్స్ చింతూరి వెంకట్రావు కాళేశ్వరపు సాంబశివరావు గార్లతో కేసు వేసి సాక్ష్యాలు నిరూపించటంతో జమిందారు నామినేషన్ తిరస్కరించ బడింది దాంతో ఆనాటికి సిటింగ్ MLA గా వున్న మట్టా రామచంద్రయ్య గారు కాంగ్రెసు అభ్యర్థి గా మిగిలారు .ఇది ఆనాటి గెలుపుకు సోపానం అయింది .
జమిందారు బాబు గురించి మరొక ఘటన చెప్పాలి .1981 రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రభంజనం ఉన్నది.స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు నిలబడినారు. అటువైపు శీలం సిద్దారెడ్డిగారు రెండు వైపులా సర్పంచుల క్యాంపులు పోటాపోటిగా నిర్వహించబడినాయి. కామ్రేడ్స్
కాళేశ్వరపు సాంబశివరావు (వెంకటాపురం ) చింతూరి వెంకట్రావు(చర్ల) గార్లు వాజేడు నుండి నలుగురు సర్పంచులను జీపులో తీసుక వస్తుండగా జమిందారు బాబు మనవాళ్ల జీపును వెంబడించి ప్రగళ్లపల్లి వద్ద తుపాకితో కాల్పులు జరిపాడు.ఆ ఘటనలో మనవాళ్లు తప్పించుకున్నారు.ఆఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెసుకు మెజారిటీ ఉన్నా
కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు విజయం సాధించినారు.
అదే జమిందారుని అసెంబ్లీ అభ్యర్థిగా ఉండనిస్తే నాటి ఫలితం ఎలా ఉండేదో కదా..
వరస విజయాలకు పునాది అయిన విజయానికి సారధ్యం వహించిన మంచి కమ్యూనిస్టు
కామ్రేడ్ టివిఆర్ చంద్రం గారికి
17 వ వర్ధంతి సందర్భంగా
విప్లవ జోహార్లు .....( *శింగు నరసింహారావు, సీపీఐ నాయకులు )*
🌺🌺🌺🌺🌺

0 Comments