Breaking News

Loading..

జనావాసాల మధ్య సెల్ టవర్లు నిర్మించవద్దు : సిపిఐ ఎం

 

భద్రాచలం జగదీష్ కాలనీలో గృహ సముదాయాల మధ్యలో నిర్మిస్తున్న 80 అడుగుల ఎయిర్టెల్ సెల్ టవర్ పనులను తక్షణమే నిలిపివేయాలని స్థానిక కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డీవో గారికి మరియు స్థానిక సీఐ గారికి వినతిపత్రం ఇచ్చినారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి స్థానిక ప్రజల ను ఉద్దేశించి మాట్లాడుతూ గత మూడు రోజులుగా జగదీష్ కాలనీ ప్రజలు మాకు సెల్ టవర్ వద్దని పెద్ద ఎత్తున అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజున మరల సెల్ టవర్ పనులు మొదలుపెట్టడానికి ప్రోక్లాలను తీసుకువచ్చిన సందర్భంగా స్థానిక కాలనీ ప్రజలు అడ్డుకొని ఆ ప్రోక్లిలేను వెనక పంపడం జరిగినది ఇప్పటికే ఆ కాలనీ ప్రజలు స్థానిక ఎమ్మార్వోకి గ్రామపంచాయతీ ఈవోకి స్థానిక ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకి వినతి పత్రాలు ఇచ్చిన కానీ వాటిని లెక్కచేయకుండా మరల సెల్ టవర్పనులు మొదలు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలు ఆర్డీవో గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది. 

ఇ ప్పటికైనా ప్రజల మనోభావాలను ప్రజల అభిప్రాయాలను గౌరవించి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఆ సెల్ టవర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేసినారు లే ని యెడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులు డి లక్ష్మి , బోడ మని, నాగమణి, నాగరాజు, రామకృష్ణ, మచ్చా రమాదేవి ,గౌతమి ,మంగ, కాల నీ ప్రజలు అనేకమంది పాల్గొన్నారు

Post a Comment

0 Comments