Breaking News

Loading..

మణుగురు లోని ముంపు పాఠశాల విద్యార్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..Itda po

 ఆదివారం నాడు ఏడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా మణుగూరులోని డిగ్రీ కాలేజ్ మరియు గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్, బాలుర హాస్టల్ వరద ముంపునకు గురి అవ్వడంతో విద్యార్థిని, విద్యార్థులందరినీ పి ఎం హెచ్ హాస్టల్ కు తరలించడం జరిగిందని ఆయన అన్నారు.

తుఫాన్ ప్రభావం వలన వర్షాలు ఇంకా పడే సూచనలు ఉన్నందున వరదలు తగ్గుముఖం పట్టే వరకు విద్యార్థిని విద్యార్థుల పట్ల వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్లకూడదని వాగులు చెరువులు వైపు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు.

అనంతరం పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందుకున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్నందున విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా సంబంధిత హెచ్ఎం లు వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ స్థానికంగా ఉండి విద్యార్థిని విద్యార్థులు ఎవరు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ టి డి ఓ అశోక్ కుమార్, పాఠశాల హెచ్ఎం, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments